Share News

Devinavaratri: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. ప్రత్యేకత ఇదే

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:32 PM

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Devinavaratri: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. ప్రత్యేకత ఇదే
Dhanalaxmi Ammavaru

జోగులాంబ గద్వాల జిల్లా, అక్టోబర్ 5: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు (Devinavaratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3 నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిదవ రోజు దుర్గాష్టమితో ఉత్సవాలు ముగియనున్నాయి. తొలిరోజు ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రి శోభ సంతరించుకుంది. వివిధ అలంకారాల్లో ఉన్న అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు తరలివెళ్తున్నారు. నేటితో (శనివారం) మూడవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని (Telangana State) జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District) గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఇక్కడే ప్రత్యేకత చోటు చేసుకుంది. ధనలక్ష్మీ అవతారంలో ఉన్న అమ్మవారిని పెద్ద మొత్తంలో డబ్బులతో అలకరించారు. అలంకారం కోసం ఎంత నగదును ఉపయోగించారో ఇప్పుడు తెలుసుకుందాం.

Mantena: ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మంతెన


ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 3,51,00,00 రూపాయలతో ధనలక్ష్మి దేవిని అలంకరించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బుతో అమ్మవారిని పట్టణ ఆర్యవైశ్యులు అలంకరించారు. నగదు, పూలతో ముగ్ధమనోహరంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి చుట్టూ కూడా నగదుతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరణ చేశారు. నగదునే పూలుగా చేసి.. అమ్మవారిని అలంకరించారు. అంతా నగదుమయంగా, ఎంతో అద్భుతంగా అలంకరించి అమ్మవారిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరశించిపోతున్నారు. ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల. కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి పాల్గొని కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రాము మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని డబ్బులతో అలంకరించడం జరిగిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మిగతా ఎనిమిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించడం జరుగుతుందని రాము వెల్లడించారు.

Dhanalaxmi-Ammavaru1.jpg

Hyderabad: పనిలో చేరిన నాలుగు రోజులకే..


మరోవైపు నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారు చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామాలయం శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సంతాన లక్ష్మీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. మూడవ రోజు గాయత్రి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే భక్తులకు దుర్గమ్మ దర్శనభాగ్యం కల్పించారు.


ఇవి కూడా చదవండి..

రూ.100 కోట్లకు మరో దావా వేస్తా

Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2024 | 12:33 PM