ఉపాధి పనులు వారంలోగా పూర్తిచేయాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:21 PM
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారంలో పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అ ధికారులకు ఆదేశించారు.

కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాలక్రైం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వారంలో పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అ ధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీవో సీ కాన్ఫరెన్స్‌హాలులో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు నిర్ధేశిత గడువులోగా పూ ర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులలో పూర్తినాణ్యత, పారదర్శకత పాటించడం తో పాటు ప్రతి పనికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. మండలాల వారిగా పూర్తయిన పనుల జాబితా, ఎఫ్‌టీవో జనరేషన్, పెండింగ్‌లోఉన్నవి, పురోగతిలో ఉన్న పనులను నిర్దేశిత సమయంలో, ఎం.బీ. రికార్డు, ఎఫ్‌టీవో జనరేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పనిలో మెటీరియ ల్, లేబర్, మిషన్ వినియోగం వివరాలను సృ ష్టంగా ఉండాలని, రోజువారి పనుల నివేదికను సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూ చించారు. అన్ని పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు పూర్తయ్యాక వెంటనే ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలన్నారు. స్వయంగా ఫీల్డ్ విజి ట్ నిర్వహించి పనుల నాణ్యతను పరిశీలిస్తాన ని, నిబంధనల ప్రకారం పనులు జరిగాయా లేదా పర్యవేక్షిస్తానని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, పీఆర్ ఈ.ఈ. దామోదర్‌రావు, డీఈలు, ఏఈలు ఉన్నారు.