Share News

Manchu Vishnu: సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నా.. విష్ణు వార్నింగ్..

ABN , Publish Date - Dec 11 , 2024 | 01:52 PM

Manchu Manoj vs Mohanbabu Controversy: మనోజ్‌తో ఘర్షణపై విష్ణు కీలక కామెంట్స్ చేశారు. బుధవారం నాడు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాట్లాడిన విష్ణు.. పలువురికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Manchu Vishnu: సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నా.. విష్ణు వార్నింగ్..
Manchu Vishnu

Manchu Manoj vs Mohanbabu Controversy: మనోజ్‌తో ఘర్షణపై విష్ణు కీలక కామెంట్స్ చేశారు. బుధవారం నాడు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాట్లాడిన విష్ణు.. పలువురికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ గొడవలన్నింటికీ కారణం బయటి వ్యక్తులేనని విష్ణు ఆరోపించారు. సోమవారం జరిగిన గొడవలో మోహన్ బాబు గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహన్‌బాబు వెంటే విష్ణు కూడా ఆస్పత్రిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం మీడియాతో మనోజ్ మాట్లాడారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన విష్ణు.. మనోజ్ వ్యాఖ్యలు, కుటుంబ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.


విష్ణు కామెంట్స్..

‘ఇది మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. మా కుటుంబంలో బయటి వ్యక్తులు ప్రమేయం ఉంటే.. వారికి ఇవాళ సాయంత్రం వరకు టైమ్ ఇస్తున్నాము. వారంతట వారే తప్పుకుంటే మంచిది. లేదంటే.. అందరి పేర్లు నేనే బయడపెడతాను.‌ మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనెప్పుడు దాడులు చేయను. నా సినిమా, మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను‌. కానీ నాకు కనుక అవకాశం ఉంటే ఫిర్యాదులు, వాయిస్ మెసెజ్ కూడా బయటికి వచ్చేది కాదు. సమయమే అన్ని సమస్యలకు సమాధానం ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు.’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు విష్ణు.


Also Read:

మంచు ఫ్యామిలీ వివాదం.. సీపీ సీరియస్‌ వార్నింగ్..!

రూ. 11వేలకే ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు..

రోహిత్.. పిచ్చి పట్టిందా..

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 11 , 2024 | 01:52 PM