Share News

Harish: బీహార్‌‌లా తెలంగాణను మారుస్తున్నారు.. హరీష్ ఆగ్రహం

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:41 PM

Telangana: ‘‘పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి’’

Harish: బీహార్‌‌లా తెలంగాణను మారుస్తున్నారు.. హరీష్ ఆగ్రహం
Former Minister Harisha Rao

మెదక్, సెప్టెంబర్ 23: సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి (Former Minister Sunitha Laxma reddy) ఇంటిపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తోందన్నారు. ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని మండిపడ్డారు. ‘‘మొన్న సిద్దిపేటలో తన కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండాల రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతోంది’’ అని విమర్శించారు. తెలంగాణకు ఉన్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బీహార్ లాగా తెలంగాణను మారుస్తున్నారన్నారు.

Big Breaking: ముంబై నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం


రెచ్చగొట్టేలా సీఎం వ్యాఖ్యలు..

నిన్న (ఆదివారం) సునీత లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి అని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లుగా సీఎం రేవంత్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారన్నారు. ‘‘ఎమ్మెల్యే ఇంటి ముందు టపాయలు కాల్చడం, ఇంట్లోకి టపాకాలయు విసరడం, ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైన చర్య’’ అని అన్నారు. ఈ విషయంపై ఎస్పీ, ఐజీతో మాట్లాడానని.. వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే కింద పడిపోయారన్నారు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదని మండిపడ్డారు.


ఇది ప్రజా పాలన కాదు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నేతలు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేదని... కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారన్నారు. ‘‘పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా.. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి. దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. హింసాత్మక ఘటనలు జరగకుండా మేం జాగ్రత్తలు తీసుకుంటుంన్నాం. అదే విధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది. ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డీజీపీ వెంటనే ఈ ఘటనపై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ ఆఫీస్‌ను ముట్టడిస్తాం’’ అని హరీష్‌ రావు స్పష్టం చేశారు.

YV Subba Reddy: తప్పు చేయకపోతే భయమెందుకు..


సునీత లక్ష్మారెడ్డి నివాసానికి...

ఈరోజు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, స్థానిక నాయకులు చేరుకున్నారు. దాడి వివరాలను ఎమ్మెల్యే‌ను అడిగి తెలుసుకున్న హరీష్.. సునీత లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి దాడికి కారకులైన వారిని అరెస్టు చేయాలని మాజీ మంత్రి కోరారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో హరీష్‌రావు ఫోన్లో మాట్లాడారు.


ఇవి కూడా చదవండి..

KTR: బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్

Beerla Ilaiah: హరీష్‌, కేటీఆర్‌లపై ప్రభుత్వ విప్ ఫైర్

Read latest Telangana News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 04:11 PM