Share News

Nallamalla: ఎవరినీ బలవంతంగా తరలించం: సీతక్క

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:48 AM

నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతుగా సహకరిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. పునరావాసం ఇష్టం లేనివారు అటవీ ప్రాంతంలోనే ఉండొచ్చని, వారికీ అన్ని విధాలా సహకరిస్తామని, ఎవరినీ బలవంతంగా తరలించేది లేదని స్పష్టం చేశారు.

Nallamalla: ఎవరినీ బలవంతంగా తరలించం: సీతక్క

దోమలపెంట, శ్రీశైలం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతుగా సహకరిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. పునరావాసం ఇష్టం లేనివారు అటవీ ప్రాంతంలోనే ఉండొచ్చని, వారికీ అన్ని విధాలా సహకరిస్తామని, ఎవరినీ బలవంతంగా తరలించేది లేదని స్పష్టం చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని నల్లమల అటవీ ప్రాంత గ్రామాలైన వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబావి గ్రామాల్లో ఆమె పర్యటించారు. సీబీఎం ట్రస్టు చైర్మన్‌, అమ్రాబాద్‌ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ ఆధ్వర్యంలో 400 మంది చెంచులకు దుప్పట్లు పంచారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అటవీశాఖ చేపట్టనున్న పునరావాస గ్రామాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా మైదాన ప్రాంతాలకు వెళ్లేవారికి సహకరించాలని అధికారులకు సూచించారు. కాగా, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.

Updated Date - Dec 02 , 2024 | 03:48 AM