Jeevan Reddy: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణం
ABN , Publish Date - May 18 , 2024 | 02:04 PM
మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాడని.. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ విశ్వాసాలను రెచ్చగొట్టుతున్నాడని.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రామాలయం దేవాలయ గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీయే అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాడని.. కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ విశ్వాసాలను రెచ్చగొట్టుతున్నాడని.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. రామాలయం దేవాలయ గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీయే అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తీర్పును గౌరవించి హిందువుల మనోభావాలు గౌరవించే విధంగా రామ్ లల్లా గేట్స్ తెరిచింది రాజీవ్ గాంధీయేనని జీవన్ రెడ్డి వెల్లడించారు. దేవాలయ గేట్స్ తెరిచినప్పుడు మోదీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
AP News: అగ్రిగోల్డ్ భూముల్లో కలప లేపేసిన వైసీపీ దొంగలు..
‘‘1989 శిలన్యాస్ చేశారు.. అప్పుడు ప్రధాని రాజీవ్ గాంధీ. గుడి శంకుస్థాపనకి అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీ. 1989లో రాజీవ్ గాంధీ అధికారం లోకి వస్తే అప్పుడే రామాలయం పూర్తి అయ్యేది. బీజేపీ ఎన్నికల కోసం గుడిని వాడుకోవడం వల్లనే వివాదం. దేశంలో మత విశ్వాసాలు రెచ్చగొట్టడంతో ఈ అంశం తీవ్రం అయ్యింది. దేశంలో ధార్మిక చింతనను పెంపొందించింది రాజీవ్ గాంధీ. ఆయన పీఎంగా ఉన్నపుడు దూరదర్శన్‌లో రామాయణ, మహా భారతాలు ప్రసారమయ్యాయి. ఆదర్శ దేవుడిగా.. పాలనలో ప్రజాభిప్రాయాన్ని విలువని ఇచ్చింది శ్రీరాముడు. దూరదర్శన్‌లో ఎవరి ఆలోచన విధానానికి అనుగుణంగా టెలికాస్ట్ అయ్యాయి? హిందువుల మనోభావాలు గౌరవించేది గాంధీ కుటుంబం. సెక్యులరిజం అంటే అందరి భావలను గౌరవించడమే’’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!
Read more Telagana News and Telugu News