Share News

జాతీయ రహదారులపై బాహుబలి కంచెలు

ABN , Publish Date - Mar 02 , 2024 | 12:47 AM

జాతీయ రహదారులపై రోజురోజుకూ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అందుకు వా హనాల రద్దీ, అతివేగం కారణాలవుతుండగా, మరోవైపు జాతీయ రహదారులపైకి విచ్చలవిడిగా మూగజీవాలు వ స్తుండటంతో కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి.

జాతీయ రహదారులపై బాహుబలి కంచెలు

వెదురు కర్రలతో ఫెన్సింగ్‌

17 బ్లాక్‌ స్పాట్ల వద్ద ఏర్పాటు చేసే ఆలోచన

చౌటుప్పల్‌, మార్చి 1: జాతీయ రహదారులపై రోజురోజుకూ ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అందుకు వా హనాల రద్దీ, అతివేగం కారణాలవుతుండగా, మరోవైపు జాతీయ రహదారులపైకి విచ్చలవిడిగా మూగజీవాలు వ స్తుండటంతో కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. ప్రమాదవశాత్తు జరుగుతున్న వాటితోపాటు పశువు ల కారణంగా జరిగే ప్రమాదాలను సైతం అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ రహదారులపై పశువుల కారణంగా నిత్యం ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకు పశువుల రాకను అడ్డుకొని ప్రమాదాల నివారణకు రహదారులకు ఇరువైపులా వెదురు కర్రలతో ఫెన్సింగ్‌ ఏర్పా టు చేయనున్నట్టు గతంలో కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వశాఖ ప్రకటించింది. అందులో భాగంగా దేశంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో చంద్రపూర్‌-యావత్‌మాల్‌ జాతీయ రహదారిపై వెదురు క్రాష్‌ బ్యారియర్లు ఏర్పాటు చేశారు. దీనికి బాహుబలి అని నామకరణం చే శారు. జాతీయ రహదారులపై ఏర్పాటు చేస్తున్న ఈ ఫె న్సింగ్‌కు ప్రత్యేకమైన బాంబుసా బాల్కో వెదురు జాతుల కు సంబంధించిన కర్రను ఉపయోగిస్తారు. దీనికి క్రియోసోట్‌ నూనెతో శుద్ధిచేస్తారు. రీసైకిల్‌ చేసిన దీనికి హైడెన్సిటీ పాలీఇథలిన్‌తో పూత పూస్తారు. దీంతో ఈ క్రాష్‌ బ్యారియర్‌ ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ప్రయోగాత్మకంగా

జాతీయ రహదారులపై పశువులు ఇతర మూగజీవాల కారణంగా కలుగుతున్న ప్రమాదాలను కొంతమేరకైనా ని వారించేందుకు ప్రయోగాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని చంద్రపూర్‌-యావత్‌మాల్‌ జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై వెదురు బొంగుల తో ప్రత్యేక ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫెన్సింగ్‌తో సత్ఫలితాలు వచ్చినట్టు కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వశాఖ అధికారులు భావించారు. మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఫెన్సింగ్‌తో సత్ఫలితాలు రావడంతో ఇతర రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల పై కూడా ఇలాంటి కంచెను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో మొదటిసారిగా హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ 44వ జాతీయ రహదారిపై ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వెదురు బొంగులతో ప్రత్యేకమైన ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని మరికొన్ని జాతీయ రహదారులపై కూడా ఇలాంటి ప్రత్యేక ఫెన్సింగ్‌లను ఏర్పాటు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

దేశంలోనే అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై నిత్యం ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ రహదారిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే దం డుమల్కాపురం నుంచి నందిగామ వరకు 17 ప్రాంతాల ను బ్లాక్‌స్పాట్‌గా గతంలో అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల పరిధిలో నిత్యం ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఇలాంటి ప్రాంతాల్లో ప్ర త్యేకంగా వెదురు బొంగులతో బాహుబలి ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోం ది. దీంతో పశువులు పెంపుడు జంతువులు, అనుకోకుండా జరిగే ప్రమాదాలను కనీస స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదాల నివారణకు వెదురు కంచెలు దోహదం : శ్రీధర్‌రెడ్డి, జీఎంఆర్‌ ప్రతినిధి

జాతీయ రహదారిపై ఏర్పాటు చేయనున్న వెదురు కం చెతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి ఈ కంచెలు ఉపయోగపడతాయి. అదేవిధంగా జాతీయ రహదారి పైకి వచ్చే పశువులు, జంతువులు, ఇతర మూగజీవాలకు అడ్డుకట్ట వేయవచ్చు. వీటిద్వారా సంభవించే ప్రమాదాలను సైతం కొంత మేర నివారించవచ్చు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మల్కాపురం నుంచి నందిగామ వరకు గుర్తించిన బ్లాక్‌ స్పాట్ల వద్ద రూ.300కోట్ల వ్యయంతో ప్రమాదాల నివారణకు త్వరలో చర్యలు చేపట్టనున్నారు. వీటికి సంబంధించి 15 రోజుల్లో టెండర్లు పూర్తవుతాయి. టెండర్లు పూర్తి కాగానే పనులు ప్రారంభమవుతాయి.

Updated Date - Mar 02 , 2024 | 12:47 AM