Share News

Drugs Case: డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ.. రకుల్ సోదరుడికి పాజిటివ్

ABN , Publish Date - Jul 16 , 2024 | 09:17 AM

డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. బ్లెస్సింగ్ అనే మహిళ 20 సార్లు హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Drugs Case: డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ.. రకుల్ సోదరుడికి పాజిటివ్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. బ్లెస్సింగ్ అనే మహిళ 20 సార్లు హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితురాలు బ్లెస్సింగ్ రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ హైదరాబాద్‌కు 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆమెతో పాటు పోలీసులకు చిక్కిన గౌతమ్‌కు ఇటీవల 13.24 లక్షల కమీషన్ అందినట్లు గుర్తించారు. గత ఏడు నెలల్లో 2.6 కిలోల కొకైన్ సరఫరా చేసినట్లు అంచనా. ఇతను నైజీరియన్ మహిళ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాను వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నార్సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితులను పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు.


ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లున్నారు. వీళ్ళ నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 13 మందికి డ్రగ్ టెస్ట్‌లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. అమన్ తోపాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నారు. ఇక అరెస్ట్ అయిన పెడ్లర్లలో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్ లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్ ఉన్నారు. నిందితులను కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే వారికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.

ఇవి కూడా చదవండి...

Encounter With Terrorists: ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు వీరమరణం

ఢిల్లీకి చంద్రబాబు.. అమిత్ షాతో భేటీ..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 09:17 AM