Adilabad: కూతురితో మాట్లాడుతున్నాడని నగ్నంగా చేసి.. చిత్రహింసలు!
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:23 AM
తన కూతురుతో మాట్లాడుతున్నాడనే కోపంతో తండ్రి ఆ యువకుడిని బంధించి.. నగ్నంగా చేసి చిత్రహింసలు పెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిందీ ఘటన.

యువకుడికి నరకం చూపిన యువతి తండ్రి
ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్
ఆదిలాబాద్ జిల్లాలో ఘటన.. 9మందిపై కేసు
ప్రధాన నిందితుడు సహా ఆరుగురి అరెస్టు
ఆదిలాబాద్ రూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తన కూతురుతో మాట్లాడుతున్నాడనే కోపంతో తండ్రి ఆ యువకుడిని బంధించి.. నగ్నంగా చేసి చిత్రహింసలు పెట్టాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిందీ ఘటన. కేసు వివరాలను శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని బంగారిగూడకు చెందిన సయ్యద్ జహీర్ ఆటో డ్రైవర్ . అదే కాలనీకి చెందిన ఓ యువతితో జహీర్ తరచూ మాట్లాడుతుండేవాడు గమనించిన యువతి తండ్రి షేక్ ఇజాజ్ తన కూతురితో మాట్లాడొద్దంటూ జహీర్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు. కోపోద్రిక్తుడైన ఇజాజ్.. గత జనవరి 8న ఆదిలాబాద్‌లోని వినాయక చౌక్ వద్ద తన ఎనిమిది మంది అనుచరులతో కలిసి ఆటోలో జహీర్‌ను కిడ్నాప్ చేశాడు.
తన స్నేహితుడైన షేక్ సలీం ఇంట్లో అతడిని బంధించాడు..అక్కడ అతడిని నగ్నంగా చేసి.. 9 మంది చిత్రహింసలు పెట్టారు. ఘటననంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవమానపర్చారు. విషయం పోలీసులకు చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు. బాధితుడు ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా 9మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో షేక్ ఇజాజ్, సోహైల్, షేక్ ముజీబ్, హజీబుల్లా, అమర్ చౌష్, సయ్యద్ జుబేర్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ఆటోలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని జీవన్‌రెడ్డి చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News