Share News

నిమిషాల్లో..చిత్రం చిత్తరువాయెగా!నిమిషాల్లో..చిత్రం చిత్తరువాయెగా!

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:25 AM

నల్లగొండ జిల్లా కేంద్రంలోని రవీందర్‌నగర్‌ కాలనీలో ఓ వేప చెట్టు కింద కూర్చున్న ఈ యువకుడి పేరు పోచయ్య. ఈయన పెన్సిల్‌ స్కెచ కళాకారుడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆ కళాకారుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ తన కళానైపుణ్యంతో పెన్సిల్‌ స్కెచ ద్వారా బొమ్మలు గీస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.

నిమిషాల్లో..చిత్రం చిత్తరువాయెగా!నిమిషాల్లో..చిత్రం చిత్తరువాయెగా!
చిత్రం వేస్తున్న పోచయ్య

అచ్చుతీసినట్లు పెన్సిల్‌ డ్రాయింగ్‌ వేస్తున్న పోచయ్య

తన నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్న కళాకారుడు

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ)

నల్లగొండ జిల్లా కేంద్రంలోని రవీందర్‌నగర్‌ కాలనీలో ఓ వేప చెట్టు కింద కూర్చున్న ఈ యువకుడి పేరు పోచయ్య. ఈయన పెన్సిల్‌ స్కెచ కళాకారుడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆ కళాకారుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ తన కళానైపుణ్యంతో పెన్సిల్‌ స్కెచ ద్వారా బొమ్మలు గీస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ రాష్ట్రాల్లోని అన్నిజిల్లాల్లో పర్యటిస్తూ బొమ్మలు గీస్తుంటారు. మహిళలు, పురుషులు, చిన్నారుల ఫొటోలను తన సెల్‌లో చూసుకుంటూ పేపర్‌పై పెన్సిల్‌తో వేగంగా గీస్తుంటాడు. అచ్చుతీసినట్లు బొమ్మ గీయడం పోచయ్య ప్రత్యేకత. ఏదో ఒక చెట్టు కింద చల్లటి ప్రదేశం, ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకొని దారిన పోయేవారిని తన బొమ్మల ద్వారా ఆకట్టుకుంటూ ప్రతి రోజూ ఓ 10 బొమ్మలను గీస్తూ ఉపాధి పొందుతున్నాడు.

పెన్సిల్‌ స్కెట్‌ డ్రాయింగ్‌

పోచయ్య ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో పర్యటిస్తూ పెన్సిల్‌ స్కెచ డ్రాయింగ్‌ వేస్తున్నాడు. అతడి పెన్సిల్‌ స్కెచ విధానాన్ని చాలామంది పరిశీలిస్తూ ఆసక్తితో తమ చిత్రాలు గీయించుకుంటున్నారు. ఫొటోను చూసుకుంటూ బొమ్మలు గీయడంతో పాటు మనిషి ఎదురుగా ఉంటే ఆ వ్యక్తిని చూస్తూ బొమ్మలు గీయడం పోచయ్య ప్రత్యేకత. తనకు వచ్చిన ఈ విద్యతో అనేక ప్రాంతాలను పర్యటిస్తూ జీవనోపాధిని పొందుతున్నాడు. తనకు వచ్చిన కళానైపుణ్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న ధరలో అందిస్తూ అబ్బురపరుస్తున్నాడు. 2011 నుంచి ఇలా వివిధ పట్టణాల్లో పర్యటిస్తూ ఎఎన్నో బొమ్మలను గీసి ప్రజల మన్ననలు పొందుతున్నాడు.

20 నిమిషాల్లోనే అద్భుతంగా..

చిత్రాన్ని బట్టి 15 నుంచి 20 నిమిషాల్లో పోచయ్య అద్భుతంగా పెన్సిల్‌తో వేసి ప్రదర్శిస్తున్నాడు. ఇద్దరు చిన్నారులతో పాటు ఓ పాప చిత్రంతో కూడిన పెన్సిల్‌ స్కెచ అంటూ బోర్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దారిన వచ్చిపోయే వాళ్లు ఆ చిత్రాలను చూసి పోచయ్యను సంప్రదిస్తున్నారు. 20 నిమిషాల్లో గీసిన ఇద్దరు చిన్నారుల చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రజల నుంచి ఆదరణ బాగా ఉంది

నేను గీస్తున్న బొమ్మలతో జీవనోపాధి బాగానే ఉంది. నాకు తెలిసిన కళను వ్యక్తీకరిస్తూ ముందుకు సాగుతున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రజల బొమ్మలను గీస్తూ వారిని సంతోష పెడుతున్నా. ఎంతో మంది నా బొమ్మలకు ఆకర్షితులయ్యారు. పెన్సిల్‌ స్కెచతో అందమైన బొమ్మలను గీస్తూ ఆకట్టుకుంటున్నా. ఈ డ్రాయింగ్‌ ద్వారా నాకు ఉపాధి కలగడమే కాకుండా ఎంతో మందికి ఇష్టమైన పెన్సిల్‌ డ్రాయింగ్‌ బొమ్మలను అందిస్తున్నా. నేను గీచిన బొమ్మలను ప్రేమ్‌ చేయించుకుంటే అనేక సంవత్సరాలు మన కళ్ల ఎదురుగానే ఉంటుంది.

పోచయ్య, పెన్సిల్‌ స్కెచ కళాకారుడు, జగిత్యాల జిల్లా

Updated Date - Mar 29 , 2025 | 12:25 AM