Share News

Suryapet: ప్రైవేటు బస్సులో గంజాయి చాక్లెట్ల పట్టివేత

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:05 AM

గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Suryapet: ప్రైవేటు బస్సులో గంజాయి చాక్లెట్ల పట్టివేత

  • విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా తనిఖీ

  • నలుగురు మహిళలు సహా ఆరుగురి అరెస్టు

కోదాడ రూరల్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ ఘటన జరిగింది. ఎక్సైజ్‌ సీఐ శంకర్‌, ఎస్సై గోవర్ధన్‌ వివరాల మేరకు.. రాష్ట్ర సరిహద్దు కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ పోలీసులు వా హనాల తనిఖీలు నిర్వహించారు.


ఈ సందర్భంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న ఓ ట్రావెల్స్‌ బస్సులో సోదాలు చేశారు. ఒడిశాకు చెందిన అనిల్‌, బకించంద్రతో పాటు మరో నలుగురు మహిళ లు బ్యాగులో గంజాయి చాకెట్లను తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీ నం చేసుకున్నారు. ఆ చాక్లెట్ల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 04:05 AM