Share News

RTC MD Sajjanar: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం

ABN , Publish Date - Jan 04 , 2024 | 01:53 PM

బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం ముగిసింది. అద్దె బస్సు ఓనర్ల తో చర్చలు సఫలమయ్యాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.

RTC MD Sajjanar: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం

హైదరాబాద్: బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో సమావేశం ముగిసింది. అద్దె బస్సు ఓనర్ల తో చర్చలు సఫలమయ్యాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఒక వారం రోజుల్లో వారి సమస్యల పరిష్కారిస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటి వేస్తామన్నారు. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని సజ్జనార్ అన్నారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండబోదన్నారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందన్నారు.

‘‘ సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా తిప్పుతాం. సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్‌ను కలిశాం. 5 సమస్యలను సజ్జ నార్‌‌కి విన్నవించాం. ఎండీ సానుకూలంగా స్పందించారు. ఈ నెల 10 వ తేదీలోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాము’’ అని ఆర్టీసీ అద్దె బస్సు యాజమాన్యం తెలిపింది.

Updated Date - Jan 04 , 2024 | 01:53 PM