Share News

Hyderabad: నీట్‌లో శ్రీచైతన్య సరికొత్త రికార్డు..

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:59 AM

నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సరికొత్త రికార్డును నెలకొల్పారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 720కి 720 మార్కులతో ఓపెన్‌ కేటగిరిలో 9 అలిండియా ఫస్ట్‌ ర్యాంకులను సాధించినట్టు ఆమె చెప్పారు.

Hyderabad: నీట్‌లో శ్రీచైతన్య సరికొత్త రికార్డు..

హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సరికొత్త రికార్డును నెలకొల్పారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి 720కి 720 మార్కులతో ఓపెన్‌ కేటగిరిలో 9 అలిండియా ఫస్ట్‌ ర్యాంకులను సాధించినట్టు ఆమె చెప్పారు. 9 మంది 720 మార్కులు, 30 మంది 715 కు పైగా, 57 మంది 710 కి పైగా, 132 మంది 700 కు పైగా, 852 మంది 650 కు పైగా మార్కులు సాధించి సత్తా చాటారని వివరించారు. అలాగే ఈ ఏడాది నీట్‌లో 22 వేల మంది విజయం సాధించడంతో పాటు, 9,512 మందికి పైగా మంది డాక్టర్లు కావడానికి సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. నీట్‌లో తమ విద్యార్థులు చూపిన అసాధారణ ప్రతిభకు గర్విస్తున్నట్లు సుష్మ తెలిపారు.

Updated Date - Jun 06 , 2024 | 03:59 AM