Share News

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:24 PM

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.

Congress: మహరాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నేతలు

ఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ పరిశీలకులను నియమించింది. ఇందుకు సంబంధించి ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో తెలంగాణ నుంచి మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. జార్ఖండ్‏కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు అధిర్‌ రంజన్‌ చౌదరి, తారిక్‌ అన్వర్‌‏ని నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ వెలువరించనున్న నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకులను నియామకం జరిగింది.

  • జార్ఘండ్ సీనియర్ పరిశీలకుడిగా భట్టి విక్రమార్క

  • మరాట్వాడా డివిజన్ కు సచిన్ పైలట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఉత్తర మహారాష్ట్ర డివిజన్‏కు సీతక్క, డాక్టర్ నసీర్ హుస్సేన్

  • ముంబయి, కొంకన్, విదర్బా, పశ్చిమ మహారాష్ట్ర డివిజన్లకు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, అవినాశ్ పాండే


Rajnath Singh: దేశ భద్రత విషయంలో రాజకీయాలు తగవు: రాజ్ నాథ్ సింగ్

CM Revanth: రాజకీయాలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తాం: సీఎం రేవంత్

ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2024 | 05:56 PM