Telangana: టీఎస్‌పీఎస్‌సీ పోస్టులకు భారీగా ఆశావహులు.. ఏకంగా 6 వందల దరఖాస్తులు
ABN , Publish Date - Jan 19 , 2024 | 09:47 PM
టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ఛైర్మన్, సభ్యుల పోస్టుల కోసం భారీగా ఆశావహులు ముందుకొచ్చారు. జనవరి 18తో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తంగా 600కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జనవరి 20న ఫైనల్ లిస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛైర్మన్ పోస్ట్ సహా మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారు సైతం అప్లై చేసుకున్నారు.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) ఛైర్మన్, సభ్యుల పోస్టుల కోసం భారీగా ఆశావహులు ముందుకొచ్చారు. జనవరి 18తో దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తంగా 600కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జనవరి 20న ఫైనల్ లిస్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఛైర్మన్ పోస్ట్ సహా మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నవారు సైతం అప్లై చేసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్స్ దరఖాస్తు చేశారు. ఫైనల్ లిస్ట్ ను ప్రభుత్వానికి జీఏడీ అందజేయనుంది. రాజకీయ ప్రమేయం లేని ఛైర్మన్‌ను, సభ్యులను నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్‌సీలో జరిగిన అవకతవకల అనుభవాల నేపథ్యంలో యూపీఎస్‌సీ తరహాలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ హయాంలో ఉన్న ఛైర్మన్, సభ్యులు ఇటీవలే రాజీనామా చేయడం.. గవర్నర్ తమిళిసై వారి రాజీనామాకు ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. ఖాళీ అయిన పోస్టుల భర్తీ కోసం జనవరి 12 న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.