Share News

VC Sajjanar: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అంతా మోసమే..

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:19 AM

ఆన్‌లైన్‌ వేదికగా జరిగే బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని, అమాయకులను బెట్టింగ్‌ కూపంలోకి లాగేందుకు కొందరు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారంటూ టీజీఎస్ఆర్టీసీ ఎం.డి. వీసీ సజ్జనార్‌(TGSRTC MD VC Sajjanar) ఎక్స్‌ (ట్విటర్‌)లో వీడియోను పోస్టు చేశారు.

VC Sajjanar: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అంతా మోసమే..

- యువకుల్లారా.. వారి వలలో చిక్కొద్దు

- ‘ఎక్స్‌’లో వీడియోను పోస్టు చేసిన వీసీ సజ్జనార్‌

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ వేదికగా జరిగే బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని, అమాయకులను బెట్టింగ్‌ కూపంలోకి లాగేందుకు కొందరు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారంటూ టీజీఎస్ఆర్టీసీ ఎం.డి. వీసీ సజ్జనార్‌(TGSRTC MD VC Sajjanar) ఎక్స్‌ (ట్విటర్‌)లో వీడియోను పోస్టు చేశారు. ‘యువకుల్లారా అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల వలలో చిక్కుకోవద్దు.. బెట్టింగ్‌కు బానిసై భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి’ అంటూ సందేశాన్ని ఇచ్చారు. తమ వ్యక్తి గత స్వార్థం కోసం ఎంతో మందిని ఆన్‌లైన్‌ జూదానికి వ్యసనపరులను చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఇలాంటి వీడియోలకు ఆకర్షితులు కావద్దని సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్లు..


city2.2.jpg

గురువారం ఉదయం ఎక్స్‌లో పోస్టు చేసిన ఆ వీడియోను సుమారు 1.89 లక్షల మంది వీక్షించారు. ఇదొక్క వీడియోనే కాదు.. తరచూ ఆన్‌లైన్‌(Online)లో జరిగే మోసాలు, వాటి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా సందేశాత్మక వీడియోలను, పోస్టర్లను షేర్‌ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారిగా ప్రస్తుతం జరుగుతున్న సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 07:19 AM