East Godavari Dist.,: కడియపులంక నర్సరీల్లో సంచరిస్తున్న చిరుత
ABN , Publish Date - Sep 27 , 2024 | 08:39 AM
తూ.గో. జిల్లా: రాజమండ్రిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా, కడియపులంక, చెక్కపల్లి వారి వీధి సమీపంలోని నర్సరీల్లో చిరుత సంచరిస్తోంది. గత మూడు రోజుల నుంచి చిరుత జంతువును తిన్నట్లు ఆనవాళ్లు కన్పించాయి.
తూ.గో. జిల్లా: రాజమండ్రి (Rajahmundry)లో చిరుతపులి (Leopart) సంచారం కలకలం రేపుతోంది. నాలుగు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా, కడియపులంక, చెక్కపల్లి వారి వీధి సమీపంలోని నర్సరీల్లో చిరుత సంచరిస్తోంది. గత మూడు రోజుల నుంచి చిరుత జంతువును తిన్నట్లు ఆనవాళ్లు కన్పించాయి. చిరుతను బంధించేందుకు అటవీశాఖ (Forest Department) అధికారులు 60 మంది సిబ్బంది, ఆరు ట్రాప్ కెమెరాలు (Trap cameras), రెండు బోన్లు (Two bones) ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో గత నాలుగు రోజుల నుంచి కడియం మండలంలోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో సమీప మండలాలైన మండపేట, ఆలమూరు ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
కాగా రెండు రోజుల క్రితం కడియంలోని ఓ కల్యాణమండపం సమీపంలో నర్సరీలో చిరుతను స్థానికులు చూశారు. వెంటనే అటవిశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫారెస్టు సిబ్బంది.. పాదముద్రలు పరిశీలించి చిరుతపులిగా నిర్దారించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. కడియపులంకలో వందల సంఖ్యలో నర్సరీలు ఉన్నాయి. అక్కడ నిత్యం పెద్ద సంఖ్యలో వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి. నర్సరీల్లో పనులు చేసేందుకు వచ్చే కూలీలు చిరుతపులి భయంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా మూడు వారాల క్రితం రాజమండ్రి శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచరించింది. రాజమండ్రి-రాజానగరం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చిరుతపులి తిరుగుతున్నట్టు గుర్తించారు. దీనిపై ఇన్చార్జి డీఎఫ్ఓ భరణి స్పందించారు. చిరుత కదలికలు తెలుసుకునేందుకు 36 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జనసంచారం ఉండే రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ చిరుతపులి తిరిగి అటవీప్రాంతంలోకి వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తప్పనిపరిస్థితులు ఏర్పడితే, ఉన్నతాధికారుల అనుమతితో చిరుతపులిని బంధిస్తామని ఇన్చార్జి డీఎఫ్ఓ వివరించారు. చిన్నపిల్లలను రాత్రిపూట బయటికి పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీ కవిత మళ్లీ రాజకీయాలపై ఫోకస్..
APMDC మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News