Share News

Cultural Heritage : ‘దండమూడి’కి శత మృదంగ వాయిద్య నివాళి

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:08 AM

విద్వాంసుడు దండమూడి రామమోహనరావు 95వ జయంతిని పురస్కరించుకుని కళాకారులు ‘శత మృదంగ వాయిద్య’ నివాళులర్పించారు.

Cultural Heritage : ‘దండమూడి’కి శత మృదంగ వాయిద్య నివాళి

విజయవాడ కల్చరల్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రముఖ మృదంగ విద్వాంసుడు దండమూడి రామమోహనరావు 95వ జయంతిని పురస్కరించుకుని కళాకారులు ‘శత మృదంగ వాయిద్య’ నివాళులర్పించారు. గాన విద్వాంసుల అత్యద్భుతమైన లయ విన్యాసం చేశారు. మృదంగ వాయిద్యంలో లయ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రతీ నాదస్వరూపం సంగీత ప్రియులకు వినసొంపుగా అంకితమైంది. స్థానిక సత్యనారాయణపురం ప్రభుత్వ సంగీత కళాశాలలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వీణ విద్యాంసుడు అయ్యగారి శ్యామసుందర్‌, అయ్యగారి జయలక్ష్మి, దండమూడి సుమతీ పాల్గొన్నారు. కార్యక్రమానికి హరగోపాల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 06:08 AM