Share News

UTF ఆ అధికారులపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:24 AM

కదిరి ప్రాంతంలో టెన్త పరీక్షల కోసం నిబంధనలకు విరుద్ధంగా సింగల్‌ టీచర్‌ను ఇన్విజిలేటర్‌గా నియమించిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఈఓ కిష్టప్పకు యూటీఎఫ్‌ నాయకులు కోరారు.

UTF ఆ అధికారులపై చర్యలు తీసుకోండి
డీఈఓకు వినతిపత్రం ఇస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

కొత్తచెరువు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కదిరి ప్రాంతంలో టెన్త పరీక్షల కోసం నిబంధనలకు విరుద్ధంగా సింగల్‌ టీచర్‌ను ఇన్విజిలేటర్‌గా నియమించిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఈఓ కిష్టప్పకు యూటీఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో డీఈఓకు వినతిపత్రం అందజేశారు. మండల విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారం ఇన్విజిలేటర్లగా ఉపాధ్యాయులను నియమించారన్నారు. ఆయన వెంట యూ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, నాయకులు భూతన్న, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, తాహీర్‌వలి, నరేశకుమార్‌, బాబయ్య, కిష్టప్ప పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 12:24 AM