Water Bell : పాఠశాలల్లో వాటర్ బెల్
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:57 AM
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల డీహైడ్రేషన్ నివారణకు ప్రతి గంటకు ఒకసారి వాటర్ బెల్ అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు తరగతి గదుల్లో నీటి బాటిళ్లు తెచ్చుకునేందుకు అనుమతి ఉంది.

10, 11, 12 గంటలకు మోగించాలంటూ ఉత్తర్వులు
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా వాటర్ బెల్ అమలు చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీచేశారు. ప్రతి గంటకు ఒకసారి అంటే 10, 11, 12 గంటలకు వాటర్ బెల్ మోగించి, విద్యార్థులు తప్పనిసరిగా నీరు తాగేలా చూడాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు తరగతి గదుల్లోకి తాగునీటి బాటిళ్లు తెచ్చుకునేందుకు అనుమతివ్వాలని ఆదేశించారు. వాటర్ బెల్ ఉత్తర్వులు అన్ని పాఠశాలలకు వర్తిస్తాయని స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..