Sri Satya sai collector సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:25 AM
జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పదివేల సోలార్ రూఫ్‌టా్‌పలను ఏర్పాటు చేయడానికి అఽధికారులు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో శుక్రవారం ఆయన జేసీ అభిషేక్‌కుమార్‌తో కలిసి జిల్లాలోని నియోజక వర్గాల అభివృద్ధిపై సమీక్షించారు.

కలెక్టర్ టీఎస్ చేతన
పుట్టపర్తిటౌన, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పదివేల సోలార్ రూఫ్‌టా్‌పలను ఏర్పాటు చేయడానికి అఽధికారులు కృషి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో శుక్రవారం ఆయన జేసీ అభిషేక్‌కుమార్‌తో కలిసి జిల్లాలోని నియోజక వర్గాల అభివృద్ధిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి ఇంటిపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. ఈసోలర్ యూనిట్ల ఏర్పాటు వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగు తాయన్నారు. నియోజకవర్గ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈకమిటీలో ఐదుగురు నిపుణులు ఉండాలన్నారు. వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అఽఽధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు సచివాలయాల్లో వాట్సాప్ గర్నమెంటు పరిపాలనపై ప్రచార పోస్టర్లు ఏర్పాటు చేయాల న్నారు. కార్యక్రమంలో ఆర్టీవోలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్, జిల్లా విద్యుతశాఖ ఎస్‌ఈ సురేంద్ర, డీపీఓ సమత, డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సీపీఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.