Share News

PLAYERS : మేమంటే ఎందుకంత మంట..?

ABN , Publish Date - Mar 02 , 2025 | 12:59 AM

పోలీసులకు క్రీడలంటే సరిపోవా లేక క్రీడాకారు లు, కోచలంటే సరిపోరా... ఎందుకింత మంట అంటూ అటు క్రీడాకారులు, ఇటు కోచ లు ధ్వ జమెత్తారు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అనే శీర్షి కతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ నానికి క్రీడాకారులు, కోచలు, క్రీడాసంఘాల ప్రతినిధులు స్పందించారు. శనివారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి తమ గోడు వెళ్లగక్కేందుకు స్థానిక సప్తగిరిసర్కిల్‌లోని అలెగ్జాండర్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నారు.

PLAYERS : మేమంటే ఎందుకంత మంట..?
Police stopping players and coaches

క్రీడాకారులు, కోచల ఆందోళన

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): పోలీసులకు క్రీడలంటే సరిపోవా లేక క్రీడాకారు లు, కోచలంటే సరిపోరా... ఎందుకింత మంట అంటూ అటు క్రీడాకారులు, ఇటు కోచ లు ధ్వ జమెత్తారు. ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అనే శీర్షి కతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథ నానికి క్రీడాకారులు, కోచలు, క్రీడాసంఘాల ప్రతినిధులు స్పందించారు. శనివారం జిల్లాకు వచ్చిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి తమ గోడు వెళ్లగక్కేందుకు స్థానిక సప్తగిరిసర్కిల్‌లోని అలెగ్జాండర్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నారు. అయితే హోంమంత్రిని కలిసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు హైరానా చేశారు. హోంమంత్రి వద్దకు వెళ్ల డానికి వీల్లేదంటూ క్రీడాకారులు, కోచల ను పోలీసులు తోసేశారు. తమ బాధలను చెప్పుకోవడానికి వస్తే పోలీసులు ఓవరాక్షన ఏంటని కోచలు, క్రీడాకారులు నిలదీశారు. ఇంతలోనే హోటల్‌ నుంచి బయటకు వచ్చిన హోంమంత్రిని కలిసి తమ గోడు వెల్లబోసుకు న్నారు. ఎన్నో ఏళ్లుగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న అనంతపురం లోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసుకుంటూ, ఆటలు ఆడుతున్నా మని మంత్రికి విన్నవించారు. అయితే ప్రస్తుతం పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా వచ్చిన కోటిరెడ్డి నీలం సంజీవరెడ్డి స్టేడియం పీటీసీకి చెందినది, ఇందులోకి ఎవరినీ అను మతించేదిలేదు,


వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ తమ క్రీడా సామగ్రిని గేటు బయటకు వేశారని తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రాక్టీస్‌ సామగ్రిని ఎక్స్‌కవేటర్‌తో తొలగించారని వాపోయారు. ఈ స్టేడియం సుమారు 60 ఏళ్లుగా ఎన్నో క్రీడా పోటీలకు వేదికగా నిలిచిందని, ఎంతోమందిని జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చి దిద్దిందని విన్నవించారు. అటు వంటి స్టేడియం నుంచి పోలీసులు దౌర్జన్యం గా తమను గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారుల సాధనకు, కోచింగ్‌, వాకింగ్‌కు, క్రీడలకు అనుమతివ్వాలని కోరారు. అంతేగాక క్రీడాకా రులను బయటకు గెంటేసిన పీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ కోటిరెడ్డిపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా పోలీసు అధికారి కోటిరెడ్డి వ్యవహరిస్తున్నారని, వెం టనే ఆయనను అక్కడ నుంచి పంపించే యాలని కోరారు. వాకర్స్‌ నుంచి డబ్బు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. యథావిధిగా నీలం సంజీవరెడ్డి స్టేడియంలో వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌, అథ్లెటిక్స్‌, కబడీ ్డ, పారా అథ్లెటిక్స్‌, క్రికెట్‌ కోచింగ్‌తో పాటు పోటీల నిర్వహణకు అనుమతి వ్వాలని కోరారు. దీనికి హోంమంత్రి స్పందిస్తూ వెంటనే పరిశీలించి క్రీడాకారులు, కోచలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో క్రీడాకారులు, కోచలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఏపీ వెటరన క్రికెట్‌ అసోసియేషన అధ్యక్ష, కార్యదర్శులు మచ్చా రామ లింగారెడ్డి, కమలాకర్‌ నా యుడు, శాప్‌ కోచలు అనిల్‌ కుమార్‌, మంజుల, సంధ్య, క్రికెట్‌ కోచ చంద్రమోహన రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 02 , 2025 | 12:59 AM