Share News

92 టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:37 AM

కాకినాడ పోర్టులో బొంబాయి కాటావద్ద అధికారులు 92 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు.

92 టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌

  • కాకినాడ పోర్టు చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్న అధికారులు

కలెక్టరేట్‌(కాకినాడ), ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): కాకినాడ పోర్టులో బొంబాయి కాటావద్ద అధికారులు 92 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. అనకాపల్లి నుంచి కాకినాడ పోర్టుకు నాలుగు లారీల్లో ముడి బియ్యం వచ్చింది. ఒక్కొక్క లారీలో 25 మెట్రిక్‌ టన్నుల నుంచి 14 మెట్రిక్‌ టన్నుల వరకు బియ్యం లోడ్‌ ఉంది. బొంబాయి కాటా వద్ద అధికారులు లారీలను క్షుణ్నంగా పరిశీలించారు. రారైస్‌లో కెర్నెల్స్‌ ఉన్నాయనే అనుమానంతో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించగా, పీడీఎ్‌స(రేషన్‌) బియ్యంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వాటిని సీజ్‌ చేసి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌మీనా 6(ఏ)కేసు నమోదు చేశారు. లారీలను పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 92 మెట్రిక్‌ బియ్యాన్ని ప్రభుత్వ గోదాంలో భద్రపర్చారు. దీనిపై కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ యాంకరేజ్‌ పోర్టుతోపాటు కాకినాడ సీపోర్టుల్లో చెక్‌పోస్టుల వద్ద అధికారులు నిఘా పెంచారు. కాకినాడ పోర్టు లోపలికి వెళ్లే ప్రతి బియ్యం లారీని తనిఖీ చేస్తున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 03:37 AM