‘మండే’ ఎండలు
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:44 AM
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సోమవారం ఎండలు జనాన్ని భయపెట్టాయి. కొందరు రక్తపోటుకు గురవగా, ఇంకొందరు చక్కెర శాతం తగ్గి ఆస్పత్రి పాలయ్యారు.

విలవిల్లాడుతున్న జనం
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సోమవారం ఎండలు జనాన్ని భయపెట్టాయి. కొందరు రక్తపోటుకు గురవగా, ఇంకొందరు చక్కెర శాతం తగ్గి ఆస్పత్రి పాలయ్యారు. ఇంకా రెండు, మూడ్రోజులపాటు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నగరి మండలంలో అత్యధికంగా 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మండలాల వారీగా.. గంగవరంలో 37.3, ఎస్‌ఆర్‌పురంలో 37.1, గుడుపల్లె, కుప్పం, శాంతిపురంలో 37, నిండ్రలో 36.8, పులిచెర్ల, రొంపిచెర్లలో 36.5, గుడిపాల, చిత్తూరులో 36.4, సోమలలో 36.1, విజయపురం, ఐరాల, చౌడేపల్లె, పాలసముద్రం, పెనుమూరులో 36, పూతలపట్టు, సదుం, వెదురుకుప్పంలో 35.9, వి.కోటలో 35.8, పెద్దపంజాణిలో 35.5, యాదమరిలో 35.1, రామకుప్పంలో 34.9, గంగాధరనెల్లూరులో 34.8, కార్వేటినగరంలో 34.3, పలమనేరులో 34.2, పుంగనూరులో 33.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.