Share News

తిరుపతికి చేరిన ‘గుండె’

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:35 AM

మరొకరికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయడానికి గుంటూరు నుంచి ‘గుండె’ను తీసుకొచ్చారు. గుంటూరులో రోడ్డు ప్రమాదానికి గురైన సుష్మ(48) బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో.. ఆమె గుండెను తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 53 ఏళ్ల వ్యక్తికి అమర్చేందుకు చర్యలు చేపట్టరు.

తిరుపతికి చేరిన ‘గుండె’
అంబులెన్సులో నుంచి ఆస్పత్రిలోకి గుండెను తీసుకెళుతున్న వైద్య సిబ్బంది

తిరుపతి(వైద్యం), మార్చి 27(ఆంధ్రజ్యోతి): మరొకరికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయడానికి గుంటూరు నుంచి ‘గుండె’ను తీసుకొచ్చారు. గుంటూరులో రోడ్డు ప్రమాదానికి గురైన సుష్మ(48) బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో.. ఆమె గుండెను తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 53 ఏళ్ల వ్యక్తికి అమర్చేందుకు చర్యలు చేపట్టరు. ఈ మేరకు శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి తన బృందంతో వెళ్లి గుండెను సేకరించి గ్రీన్‌ఛానల్‌ ద్వారా ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి 9.38 గంటలకు విమానాశ్రయానికి.. ప్రత్యేక అంబులెన్సులో 9.59 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్న వైద్య బృందం ఆ గుండెను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లింది. ఈ శస్త్ర చికిత్స పూర్తయ్యేందుకు 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు 18 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం 19వ గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:35 AM