Share News

H-1B Visa Approvals: గతేడాది అత్యధికంగా హెచ్-1బీ వీసాలు స్పాన్సర్ చేసిన కంపెనీలు ఇవే

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:50 AM

గతేడాది హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేసిన కంపెనీల వివరాలను యూసీఎస్ఐస్ విడుదల చేసింది. మరి ఈ జాబితాలో భారతీయ కంపెనీలు ఎన్ని ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.

H-1B Visa Approvals: గతేడాది అత్యధికంగా హెచ్-1బీ వీసాలు స్పాన్సర్ చేసిన కంపెనీలు ఇవే
H-1B visa approvals

అమెరికాలో హెచ్-1బీ వీసా అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది అత్యధికంగా హెచ్-1బీ వీసాలు పొందిన కంపెనీల వివరాలను యూఎస్‌సీఐఎస్ తాజాగా వెల్లడించింది. గతేడాది జారీ అయిన వీసాల్లో దాదాపు ఐదో వంతు భారత మూలాలున్న టెక్ కంపెనీలే సొంతం చేసుకున్నాయట. గతేడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో జారీ అయిన 1,30,000 వీసాల్లో 24,766 వీసాలను భారత మూలాలున్న కంపెనీలు దక్కించుకున్నాయట.


యూఎస్‌సీఐఎస్ సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్‌కు 8140 వీసాలు దక్కాయి. టీసీఎస్‌కు 5274 వీసాలు అప్రూవ్ అయ్యాయి. హెచ్‌సీఎల్ అమెరికాకు 2953, విప్రోకు 1634 వీసాలు దక్కాయి. టెక్ మహీంద్రా 1199 వీసాలు దక్కించుకుంది. అయితే, జెఫ్ బెజోస్ సారథ్యంలోని అమెజాన్ అత్యధికంగా 9265 వీసాలు దక్కించుకుంది.

Also Read: బహ్రెయిన్ తెలుగు కళా సమితి ఇఫ్తార్ విందులో అరబ్బు ప్రముఖులు


యూఎస్‌సీఐఎస్ పోర్టల్ ప్రకారం, కంపెనీల స్పాసర్స్ షిప్ సాయంతో వీసాలు పొందిన వ్యక్తులను అప్రూవ్డ్ బెనిఫీషియరీస్‌గా పేర్కొంటారు. కొత్తగా వీసాలు పొందిన వారితో పాటు వీసాలు పొడిగించుకున్న వారు కూడా ఈ జాబితాలో ఉంటారు. అయితే, వీసా పొందిన తరువాత విధులు ప్రారంభించారా లేదా అన్న సమాచారం మాత్రం ఈ వివరాల్లో ఉండదు.

హెచ్-1బీ వీసా పొందిన టాప్ కంపెనీలు ఇవే.

  • ఆమెజాన్. కామ్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌సీ: 9,265 వీసాలు

  • ఇన్ఫోసిస్ లిమిటెడ్: 8,140 వీసాలు

  • కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్: 6,321 వీసాలు

  • గూగుల్ ఎల్‌ఎల్‌సీ: 5,364 వీసాలు

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్: 5,274 వీసాలు

  • మెటా ప్లాట్‌ఫార్మ్స్ ఇన్‌క్: 4,844 వీసాలు

  • మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్: 4,725 వీసాలు

  • ఆపిల్ ఇన్‌క్: 3,873 వీసాలు

  • హెచ్‌సీఎల్ అమెరికా ఇన్‌క్: 2,953 వీసాలు

  • ఐబీఎమ్ కార్పొరేషన్: 2,906 వీసాలు

Also Read: దుబాయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2025 | 09:54 AM