సత్యదేవుని హుండీల ఆదాయం రూ.1.19 కోట్లు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:11 AM
రూ.1.19,10,887 నగదు, 25 గ్రాముల బంగారం, 512 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్‌ఏకు చెందిన 46 డాల ర్లు, మలేషియా 15, ఆస్ట్రేలియా

అన్నవరం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవునికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1.19,10,887 నగదు, 25 గ్రాముల బంగారం, 512 గ్రాముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యూఎస్‌ఏకు చెందిన 46 డాల ర్లు, మలేషియా 15, ఆస్ట్రేలియా 20, యుఏఈ 105 దిరహమ్స్ లభించాయి. 25 రోజులకు ఈ ఆదాయం సమకూరగా సరాసరిన రోజుకు రూ. 4.76 లక్షలు భక్తులు హుండీల్లో కానుకల రూ పంలో సమర్పించుకున్నారు. లెక్కింపును ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ రోహిత్‌లు పర్యవేక్షించగా సిబ్బంది,సేవాసంస్థ సభ్యులు లెక్కించారు.
పట్టువస్త్రాలు సమర్పణ
విశ్వావసు నామ ఉగాది పర్వదినం పురస్కరించుకుని విశాఖపట్నం లక్కీషోరూం ప్రతినిధులు శ్రీనివాసరావు, దత్తయ్యలు శుక్రవారం రత్నగిరిపై స్వామి,అమ్మవార్లకు, ఉపాలయాలలో ఉన్న సీతారాములు, వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లకు నూతన పట్టువస్త్రాలను సమర్పించారు. వాటిని ఆలయ ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్‌కు అందజేశారు. కార్యక్రమంలో అన్నవరం వాసవీ ఆర్యవైశ్య నిత్యన్నసత్ర సమా జం అధ్యక్షుడు పేరూరి గాంధీ పలువురున్నారు.
సీతారాముల కల్యాణానికి...
అన్నవరం ఆలయ క్షేత్రపాలకులైన సీతారాముల దివ్యకల్యాణ మహోత్సవాలు సందర్భంగా విశాఖపట్నంకు చెందిన మల్లెల వీరరాఘవరావు, దువ్వ గ్రామానికి చెందిన కాశీ పట్టువస్త్రాలను దేవస్థానం అదికారులకు అందించగా దాతలను ఆయన అభినందించారు.
రూ.10 లక్షల విరాళం
అన్నవరం దేవస్థానంలో సత్యగిరి కొండపై నిర్మితమైన శివసదన్ కాటేజీకి శుక్రవారం ఒక దాత రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ మొత్తాన్ని ఈవో వీర్ల సుబ్బారావుకు అంద జేయగా పేరు చెప్పడానికి ఇష్టపడని రాజమండ్రికి చెందిన దాతను ఈవో అభినందించారు.