అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రూ.26,48,813
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:26 AM
అంతర్వేది, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వా

అంతర్వేది, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటైన డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం తనిఖీ అధికారి జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీలను లెక్కించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. ప్రధాన ఆలయ హుండీ ద్వారా రూ.25,86,985, గుర్రాలక్కమ్మ హుండీ రూ.20, 676, అన్నదాన హుండీ రూ.41,152 మొత్తం హుండీల ద్వారా 39 రోజులకుగాను రూ.26,48,813 ఆదాయం వచ్చినట్టు ఏసీ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్‌బాబు, ఒడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.