Share News

శాసనసభ కమిటీల్లో బండారు, గిడ్డికి అవకాశం

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:47 AM

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శాసనసభ కమిటీల్లో కోనసీమ జిల్లా నుంచి ఇద్దరు శాసనసభ్యులకు ప్రాతినిధ్యం లభించింది. వారిలో టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

శాసనసభ కమిటీల్లో బండారు, గిడ్డికి అవకాశం

అమలాపురం, మార్చి 20(ఆంధ్రజ్యో తి): రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శాసనసభ కమిటీల్లో కోనసీమ జిల్లా నుంచి ఇద్దరు శాసనసభ్యులకు ప్రాతినిధ్యం లభించింది. వారిలో టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు స్థానం లభించింది. ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌గా ఆచంట నియోజకవర్గానికి చెందిన పితాని సత్యనారాయణ వ్యవహరిస్తారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి సత్యనారాయణను ప్రభుత్వ ఎస్యూరెన్స్‌ కమిటీలో సభ్యునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీకి చైర్మన్‌గా కామినేని శ్రీనివాసరావు వ్యవహరిస్తారు. ఇద్దరు ఎమ్మెల్యేలను శాసనసభ కమిటీల్లో నియమించడం పట్ల ఆయా ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేన శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Mar 21 , 2025 | 01:47 AM

News Hub