Share News

బెల్ట్‌.. తీయరా!

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:43 AM

మద్యం వ్యాపారులు నిబంధనలు భేఖాతరు చేస్తున్నారు.. ధరలు పెంచి మందుబాబుల జే బులు ఖాళీ చేస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినా ఫలితం లేకుండా పోతోంది.

బెల్ట్‌.. తీయరా!

జిల్లాలో సుమారు 200పైనే?

దుకాణాలకు అనుబంధం

ధర పెంచి విక్రయాలు

షాపుల వద్ద రూ.10 అధనం

బెల్ట్‌ దుకాణాల వద్ద రూ.30

పెరిగిన సారా విక్రయాలు

ఇప్పటి వరకూ 623 కేసులు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

మద్యం వ్యాపారులు నిబంధనలు భేఖాతరు చేస్తున్నారు.. ధరలు పెంచి మందుబాబుల జే బులు ఖాళీ చేస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించినా ఫలితం లేకుండా పోతోంది. జిల్లా వ్యాప్తంగా కొన్ని షాపుల్లో అదనంగా రూ.10 వరకూ వసూలు చేయడం గమనార్హం. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం ప్రతీ బాటిల్‌ మీద సరాసరి రూ.50 వరకూ తగ్గించింది. జిల్లాలో రాజకీయాల ముసుగుతో లిక్కర్‌ వ్యాపారాల్లో కొనసాగుతున్న అనేక మంది దోపిడీకి పాల్పడుతున్నారు. మరో వైపు మండల యూనిట్‌గా తీసుకుని మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో జిల్లాలో ఎక్కడికక్కడ బెల్ట్‌ జోరు పెరిగింది. ప్రతి మం డలంలోనూ అనధికారికంగా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. వాస్త వానికి జిల్లాలో 125 అధికారిక మద్యం దుకా ణాలు ఉన్నాయి.మండలం యూనిట్‌ తీసు కుని షాపులు కేటాయించడంతో ప్రస్తుతం అదే ప్రా తిపదికన షాపులు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 40 నుంచి 50 వరకూ బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.పైగా ఇక్కడ ఎంఆర్‌పి కంటే కనీసం రూ.30 అదనంగా అమ్ముతుండడం గమనార్హం. అదికాకుండా అధికారిక మద్యం షాపుల్లో జిల్లాలో చాలా చోట్ల ఎంఆర్‌పి కంటే రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం సిటీలో మాత్రం వసూలు లేవని అధికారులు చెప్పడం గమనార్హం. మరో వైపు జిల్లాలో నాటు సారా ఆగలేదు. రాజ మహేంద్రవరం పరిసర ప్రాంతాలతో పాటు జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల నాటు సారా తయారీ,రవాణా, విక్రయం ఇష్టానుసారం సాగుతోంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం నవోదయం కార్యక్రమంలో చాలా వరకూ మార్పు తెచ్చింది. కానీ గత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ నవోదయం-2ను అమలు చేస్తుంది.

ఈ ఏడాది పలు కేసులు

ఈ ఏడాది జిల్లాలో సారా, బెల్లం ఊట వంటి తయారీదార్లపై 623 కేసులు నమోదు చేసి 473 మందిని అరెస్ట్‌చేశారు. 5133 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 3,36,100 క్వింటాళ్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 27 వాహనాలను సీజ్‌ చేశారు. 7130 కేజీల నల్లబెల్లం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.డీసీఎల్‌కు సంబంధించి 378 కేసులు పెట్టి 382 మందిని అరెస్ట్‌ చేసి 1294.79 లీటర్లు ఐఎంఎఫ్‌ఎల్‌ స్వాధీనం చేసుకున్నారు. 206 .85 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:43 AM