వేతనాల కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:38 AM
కనీస వేతనం గిట్టుబాటు కాకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు వస్తున్న ఉపాధి కూలీలకు గత మూడు నెలల నుంచి వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు.

జనవరి 13నుంచి ఉపాధి కూలీలకు అందని వేతనాలు
జిల్లాలో రూ.51కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలు
అయినా ఆగని ఉపాధి పనులు
త్వరలో విడుదలవుతాయంటూ సర్దిచెబుతున్న అధికారులు
అంబాజీపేట, మార్చి20(ఆంధ్రజ్యోతి): కనీస వేతనం గిట్టుబాటు కాకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులకు వస్తున్న ఉపాధి కూలీలకు గత మూడు నెలల నుంచి వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. వారానికి ఒకసారి వేతనాలు వస్తాయని పనులకు వస్తున్న కూలీలకు పస్తులు తప్పడంలేదు. సకాలంలో వేతనాలు అందక ఉపాధి కూ లీలు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2024-25 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 57 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్ణయించారు. గత ఏడాది వేతనాలు వారానికి లేదా నెలలోపు అందించినప్పటికీ ఈ ఏడాది జనవరి 13 నుంచి నేటి వరకూ ఉపాధి కూలీలకు వేతనాలు మంజూరుకాలేదు. జిల్లాలో సుమారు రూ.52 కోట్ల మేర ఉపాధి హామీ పనులకు సంబంధించి నిధులు విడుదల కావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. దీనిలో కూలీలకు 3.1 లక్షల పనిదినాలకు రూ. 300 వంతున రూ.8.76 కోట్ల మేర వేతనాలు బకాయిలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే మిగిలినవి ఉపాధి హామీ ద్వారా చేపట్టే పనులు, గోకులం షెడ్లకు సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉంది. గత మూడు నెలల నుండి ఉపాధి హామీ నిధులు అందకపోవడంతో పను లకు వెళ్లాలా లేదో తెలియని పరిస్థితి వారిలో నెలకొంది. ఇంత బకాయిలను ఒకేసారి అంది స్తారా లేదా అని ఉపాధి కూలీలకు అనుమానం వ్యక్తమవుతోంది. ఒకే కుటుంబంలో పనిచేసిన వారికి వేతనాలు అందకపోవడంతో ఆయా కు టుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. త్వరలో వేతన బకాయిలు విడుదల అవుతాయంటూ అఽధికారులు ఉపాఽధి కూలీలకు సర్దిచెబుతున్నారు. దీనిపై ఇటీవల పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధి పను ల్లో అవినీతి జరిగిందన్నారు. సోషల్ ఆడిట్‌లో అధికారులు అవినీతికి పాల్పడినట్టు గుర్తించి వారిని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింద న్నారు. అయితే ఉపాధి హామీ వేతనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని, త్వరలో ఈ నిధులను ఉపాధి కూలీలకు చెల్లిం చే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్‌కల్యాణ్ అసెంబ్లీలో వివరించారు.