Share News

సీఎం గారూ..కావాలివీ!

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:18 AM

సీఎం చంద్రబాబు ఉంటే అధికారులు ఉరు కులు..పరుగులు పెట్టాల్సిందే మరి.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిందే మరి.. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 10 నెలల్లోనే రెండు సార్లు ప్రత్యక్షంగా కలిశారు.. జిల్లా అవస రాలపై సమీక్షించారు.

సీఎం గారూ..కావాలివీ!
కలెక్టర్‌ ప్రశాంతి

నేడు, రేపు సీఎం కాన్ఫరెన్స్‌

38 డిపార్ట్‌మెంట్లపై నివేదిక

ప్రధాన సమస్యలపై ఫోకస్‌

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

సీఎం చంద్రబాబు ఉంటే అధికారులు ఉరు కులు..పరుగులు పెట్టాల్సిందే మరి.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిందే మరి.. కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు 10 నెలల్లోనే రెండు సార్లు ప్రత్యక్షంగా కలిశారు.. జిల్లా అవస రాలపై సమీక్షించారు. మంగళ, బుధవారాల్లో మూడో సారి కలవనున్నారు.ఈ మేరకు జిల్లా లో ముఖ్యమైన 38 ప్రభుత్వ శాఖల పరిధిలో అభివృద్ధి, అవసరాలు, సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వం వల్ల పెండింగ్‌లో వివిధ పనుల బి ల్లులు వంటివి వాటి వివరాలతో జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం అమరాతికి బయలు దేరి వెళ్లారు. రాజధాని అమరావతిలో మంగళ, బుధవారాల్లో సీఎం నారా చంద్రబాబునా యు డు జిల్లా కలెక్టర్లతో మూడో కాన్ఫరెన్స్‌ నిర్వ హించనున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కలెక్టర్లను అడిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, సమీక్షలు చేసేవారు. ప్రస్తుతం జిల్లాకు ఓ ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా నియమిం చారు. ఆ అధికారి మొదట జిల్లా కలెక్టర్‌తో సమీక్షిస్తారు. తర్వాత కలెక్టర్‌ సుమారు 30 నిమిషాల పాటు జిల్లా పరిస్థితిపై వివరించే అవకాశం ఉంది. 15 నిమిషాల పాటు జిల్లా లోని అభివృద్ధి, సంక్షేమం, ఇతర అంశాలపై ప్రజంటేషన్‌ చేస్తారు. తర్వాత దానిపై 5 నిమి షాల పాటు చర్చ ఉంటుంది. వేసవి కాలం కాబట్టి ప్రధానంగా సాగు, తాగునీటిపై బాగా ఫోకస్‌ చేసే అవకాశం ఉంది. బురదకాలువ ్జకారణంగా కాపవరం, బూరుగుపూడి, శ్రీరం గపట్నం, బుచ్చింపేట. మిర్తిపాడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఇక్కడ సు మారు 27 ఎకరాల ఆయకట్టు కూడా దెబ్బ తింటుందనే విషయాన్ని ప్రస్తావించే అవకా శం ఉంది. 2023లో బురదకాలువ అభివృద్ధి పనులకు 91.17 కోట్లు మంజూరయ్యాయి. నాడు వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు వేయడా నికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ఆగిపోయాయి. వాటికి మూడోసారి టెండరు పిలిచి పనులు చేసే అవకాశం ఇవ్వా లని అడగనున్నట్టు సమాచారం. ఎర్రకాలువ సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. ఇక జిల్లాలో 38 డిపార్ట్‌ మెంట్లకు సంబంధించి సుమారు 600పైగా పేజీల నివేదికలు రావడం గమనార్హం. అం దులో సుమారు 8 పేజీల్లో ముఖ్య సమస్యలు, అవసరాలపై ప్రత్యేక నివేదిక తయారు చేసి నట్టు తెలిసింది.తొలిరోజు అంటే మంగళవారం మొత్తం 9 జిల్లాల కలెక్టర్లకు అవకాశం లభిం చనుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే తూర్పుగోదావరి జిల్లా ఏడోది అవు తుంది.అందువల్ల మంగళవారమే కలెక్టర్‌ ప్రశాంతికి అవకాశం లభించవచ్చు. ఇంకా కొత్తగా రేషన్‌కార్డులు, పింఛన్లు, రోడ్లు, పెం డింగ్‌ బిల్లుల మీద కూడా నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. కలెక్టర్‌ ప్రశాంతి ప్రజ లకు ఉపయోగపడే పలు అంశాలపై కూడా ప్రజంటేషన్‌ చేసే అవకాశం ఉంది.

Updated Date - Mar 25 , 2025 | 12:18 AM