మామూళ్ల మత్తు మందు!
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:16 AM
ఔషధ నియంత్రాధికారులు నిద్దరోతున్నారు.. చుట్టూ దోపిడీ జరుగుతున్నా ఏం తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. కళ్లెదుట దోపిడీ సాగుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ మనకెందుకొచ్చిందని వదిలేస్తున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు
ఉమ్మడి జిల్లాలో 3,500 షాపులు
ఏడాదికి రూ.6 కోట్లు వసూళ్లు?
ప్రతి దానికి ఒక రేటు నిర్ణయం
తూతూ మంత్రంగా తనిఖీలు
‘ఆపరేషన్ గరుడ’ అంతంతే
కన్నెత్తి చూడని డ్రగ్స్ యంత్రాంగం
ఇష్టానుసారం వ్యాపారుల దోపిడీ
మోసపోతున్న వినియోగదారులు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఔషధ నియంత్రాధికారులు నిద్దరోతున్నారు.. చుట్టూ దోపిడీ జరుగుతున్నా ఏం తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. కళ్లెదుట దోపిడీ సాగుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ మనకెందుకొచ్చిందని వదిలేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి సుమారు రూ.5 కోట్లు పైనే మామూళ్లు వసూళ్లు చేస్తున్నారంటే పరి స్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హడావుడిగా చేసిన తనిఖీలే అందుకు ఉదాహరణ.. 16 షాపుల్లో తనిఖీలు చేసి కేవలం 11 చిన్న కేసులే నమోదు చేశారు. ఉన్నతాధికారులకు తూతూ మంత్రపు నివేదిక పంపి చేతులు దులుపుకున్నారు.
మందుల ధరల బాదుడే..
ప్రస్తుతం మనిషికి ఔషధం అనేది నిత్యావ సరం. ప్రతి ఇంటిలోనూ నెలకు వచ్చిన ఆదా యంలో సు మారు పది నుంచి 50 శాతం మందులకు ఖర్చు చేస్తున్నా రంటే ఏమేరకు అవసరాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయినా దోపిడీ మాత్రం ఆగడం లేదు. నిత్యావసర మందుల ధరలు పెంచి విక్ర యిస్తున్నారు. అయినా అడిగేవాడులేడు. పట్టిం చుకునేవారు అసలే లేరు.. మందులు ఎంత అంటే అంత పెట్టి కొనాల్సిందే. మెడికల్ షాపు ల్లో నకిలీ మందులు ఇబ్బడి ముబ్బడిగా ఉంటు న్నా ఇటీవల చేసిన తనిఖీల్లో ఒక్కటీ పట్టుకోలేక పోవడం కొసమెరుపు. మరోవైపు మందుల ధర లు ఇష్టానుసారం పెంచేస్తున్నా అడిగే నాథుడు లేడు. బీపీకి వాడే ఇస్పిన్ 10 ట్యాబ్లెట్ల ట్రిప్ కరో నాకు ముందు రూ.28 వరకూ ఉండేది. ప్రస్తు తం రూ.82 తీసుకుంటున్నారు. ఇలా అనేక రకా ల మందుల ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. జనరిక్ మెడికల్ షాపుల్లోనూ అధిక ధరలకు అమ్మేస్తున్నా కనీస తనిఖీలు కానరావడం లేదు. మరోవైపు ఆన్‌లైన్‌లోనూ మందులు అమ్మేస్తు న్నారు. ఇంకోవైపు మత్తు టాబ్లెట్ల వాడకం పెరి గినట్టు సమాచారం. మొన్న శనివారం చేసిన తనిఖీల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీలో ట్రమ డాల్ ఇంజక్షన్లు ఉండాల్సిన స్టాకుకంటే తక్కు వగా ఉండడమే ఉదాహరణ. దీనిపై అధికారు లు కేసు నమోదు చేశారు.
అధికారులేం చేయాలి..
ఉమ్మడి తూర్పుగోదావరి, కొవ్వూరు డివిజన్ పరిధి కలిపి రాజమహేంద్రవరంలోనే డ్రగ్స్ ఏడీ కార్యాలయం ఉంది. దీని పరిధిలో మెడికల్ షాపులు, ఏజెన్సీలు సుమారు 3,500 వరకూ ఉన్నాయి. అవి కాకుండా ఆసుపత్రుల్లో కూడా మెడికల్ షాపులు ఉన్నాయి. బ్లడ్‌బ్యాంక్‌లు చాలా ఉన్నాయి. జిల్లా ఔషధ నియంత్రాధికారి కార్యాలయంలో ఏడీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఉం టారు. ఎవరు ఏ మందులు అమ్ముతున్నారు. నిబంధనల ప్రకారం అమ్ముతున్నారా అనేది పర్యవేక్షించాలి. కానీ సుమారు రెండేళ్లుగా ఔష ధ నియంత్రణ అధికారి కార్యాలయం నుంచి సరైన సమాచారం ఉండడం లేదు. నెలవారీ ఎన్ని శాంపిల్స్ తీశారో.. ఎక్కడ కేసులు పెట్టారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మామూళ్లు వసూళ్లు చేసుకుంటూ మత్తులో జోగుతున్నారు.. రూ.కోట్లు గడిస్తున్నారు. ప్రజలు మాత్రం పెద్దఎత్తున మోసపోతున్నారు.
16 షాపులు.. 11 కేసులు
మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారనే కారణంతో ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్, డ్రగ్స్, ఈగల్, పోలీసు తదితర అధికారుల బృందాలతో ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో 16 షాపులపై దాడులు చేశారు. ఈ 16 షాపుల జాబితా ముందే సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదా వరి జిల్లాలో 8, కాకినాడ జిల్లాలో 4, అంబే డ్కర్ కోనసీమ జిల్లాలో 4 దుకాణాలపై దాడులు చేశారు. తనిఖీల్లో పెద్ద కేసు లేమీ పెట్టలేదు. స్టాక్ రికార్డుకు.. స్టాక్‌కు మధ్య తేడా ఉన్నట్టు 11 చోట్ల నమోదు చేశారు. ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నారనే కారణంతో నాలుగు కేసులు నమోదు చేశారు. అనుమానం వల్ల మూడుచోట్ల శాంపిల్స్ తీసుకున్నారు. రెండుచోట్ల ట్రమడాల్ ట్యాబ్‌లెట్లు ఎవరికి విక్రయించారనే దానిపై ఆరా తీశారంతే. కానీ వీటి వివరాలేమీ అధికారికంగా డ్రగ్స్ ఏడీ ఆఫీసు చెప్పక పోవడం గమనార్హం. విజిలెన్స్ అధికారులు మాత్రం వివరాలిచ్చారు. మందుల షాపుల్లో జరుగుతున్న దందా ఏమైందో మరి.
ప్రతీ దానికో రేటు..
ఎవరైనా మెడికల్‌షాపు పెట్టుకోవాలంటే పదో తరగతి చదివితే చాలు. నాలుగేళ్లు అనుభవం ఉండాలి. కానీ ఫార్మాసిస్ట్ పర్యవేక్షణలో మం దులు అమ్మాలి. డిగ్రీ చదివితే ఒక ఏడాది అనుభవంచాలు. ఎంత పెద్దషాపు పెట్టాలన్నా కేవలం 3 వేలు చలానా కడితే చాలు. లైసెన్స్ ఇవ్వడానికి మూమూళ్లు భారీగానే ఇవ్వాలి. ఇక ప్రతి దుకాణం నుంచి ఆరు నెలలకోసారి రూ.5 వేలు వంతున మామూళ్లు ఇవ్వాలి. ప్రతి ఏటా ఇన్‌స్పెక్షన్ పేరిట వస్తే ఒక్కో షాపు కనీసం రూ.10 వేలు ఇవ్వాల్సిందే. ప్రతి షాపును ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవా లి. ఇది ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. కానీ దుకా ణాన్ని బట్టి కనీసం రూ.25 వేల నుంచి మొద లవుతుంది. షాపు షిఫ్టింగ్‌కు రూ.15 వేల వం తున ఇవ్వాలి. ఇదంతా ఆయా ప్రాంతాల యూనియన్ నాయకులే స్వయంగా ఒక గు మస్తాతో వసూలు చేయిస్తారు. నెలకోసారో, వీలైనప్పుడో నేతలు స్వయంగా క్యాష్ బ్యాగ్ తీసుకుని వెళ్లి సదరు అధికారికి సమర్పించు కుంటారు. అక్కడి కొన్ని వాటాలు ఉంటాయి. ఇక్కడ కొందరు యూనియన్ నేతలు కూడా ఇష్టంలేని వారిపై దాడులు చేయిస్తారు. అప్పు డు అధికారులు వీరితో చేతులు కలుపుతారు. ఆరు నెలలకు దుకాణానికి రూ.5 వేల వంతు న మొత్తం 3,500 దుకాణాల నుంచి రూ.1.75 కోట్ల మామూళ్లు వస్తాయని అంచనా. ఇన్ స్పెక్షన్ పేరిట ఏడాదికి వసూలు చేసేది 3, 500 దుకాణాల నుంచి రూ.3.50 కోట్లు. రె న్యూవల్‌కు ఐదేళ్లకోసారి రూ.5.25 కోట్లు వసూలు చేస్తారు. ఆకస్మిక తనిఖీలు, తప్పులు దొరికినప్పుడు వసూలు అందనం. ఆరు నెలల కిందట ఒక షాపు వద్ద డ్రగ్స్ దొరకడంతో భారీగా వసూలు చేసినట్టు ప్రచారం ఉంది.