Share News

ప్రభుత్వాసుపత్రిలో అవినీతి చేస్తే ఇంటికే!

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:26 AM

ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్ర భుత్వం కృషి చేస్తోందని అందుకే అత్యధిక ప్రా ధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక తిలక్‌రోడ్డులోని తన కార్యాలయంలో శనివారం నియోజకవర్గానికి సంబంధించి ఆరుగురు లబ్ధిదారులకు సీఎం ఆర్‌ఎఫ్‌ రూ.8 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.

ప్రభుత్వాసుపత్రిలో అవినీతి చేస్తే ఇంటికే!
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వాసు

  • ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం

  • సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 22(ఆంధ్ర జ్యోతి): ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్ర భుత్వం కృషి చేస్తోందని అందుకే అత్యధిక ప్రా ధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక తిలక్‌రోడ్డులోని తన కార్యాలయంలో శనివారం నియోజకవర్గానికి సంబంధించి ఆరుగురు లబ్ధిదారులకు సీఎం ఆర్‌ఎఫ్‌ రూ.8 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్‌ వైద్యసేవలు అం దని పేదలకు ఈ విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సా యం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా నని ఎన్నికల్లో ఇచ్చిన హామి మేర కు సీఎం చంద్రబాబు పేదలను అన్నివిధాల ఆదుకుంటున్నారని చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మార్చురీ వద్ద డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అలా డబ్బులు డిమాండ్‌ చేసిన భవానిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించామని వాసు చెప్పారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేదలను డబ్బుల కోసం డిమాండ్‌ చేస్తే ఉద్యోగులను ఇంటికి పంపించి వేస్తామని హెచ్చరించారు.

  • క్రీడాపోటీలు సంతోషంగా జరిగాయి

అసెంబ్లీ సమావేశాల్లో తమకు కావాలిసిన పనులను డిమాండ్‌ చేశామని ఎమ్మెల్యే వాసు అన్నారు. పుష్కరాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కోరామని చెప్పారు. ఎమ్మెల్యేల ఆటల పోటీలు సంతోషంగా జరిగాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, నాయుడు మాస్టర్‌, దుత్తరపు గంగాధర్‌, వీరా రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:26 AM