Share News

వైభవంగా నూకాలమ్మ గరగల మహోత్సవం

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:15 AM

అన్నవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కొత్త అమావాస్యరోజున జరిగే మండపం నూకాలమ్మను జాతర పురస్కరించుకుని శనివారం కాకినాడ జిల్లా అన్నవరంలో గర

వైభవంగా నూకాలమ్మ గరగల మహోత్సవం
గరగల మహోత్సవంలో పాల్గొన్న జబర్దస్త్‌ నటుడు దొరబాబు, గ్రామస్తులు

పాల్గొన్న జబర్దస్త్‌ నటుడు దొరబాబు

అన్నవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కొత్త అమావాస్యరోజున జరిగే మండపం నూకాలమ్మను జాతర పురస్కరించుకుని శనివారం కాకినాడ జిల్లా అన్నవరంలో గరగల మహోత్సవం మహిళలు, యువకుల కేరింతల నడు మ వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు మండపం గ్రామం నుంచి 5కిలోమీటర్ల దూరం పూల గరగతో పాటుగా చిన్న గరగలతో నడిచి వచ్చారు. పూలగరగకు మహిళలు బిందెలతో నీళ్లుపోసి పసుపు, కుంకుమలు పూసి సారె, చీరలు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు రావిచెట్టు సెంటర్‌లో గరగల మహోత్సవం జరిగింది. మండపం నూకాలమ్మ అన్నవరం అత్తివారి ఆడపడుచుగా పూజలందుకోవడంతో ముందు గా వారింటికి చేరుకుని అక్కడ పాన్పు అనం తరం నైవేద్యాలు సమర్పించారు. 2గంటల నుం చి సాయంత్రం 4 వరకు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గరగల సంబరం జరిగింది. జబర్దస్త్‌ నటుడు దొరబాబు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:15 AM