Share News

బలభద్రపురంలో క్యాన్సర్‌పై తప్పుడు నివేదిక

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:45 AM

బలభద్రపురంలో క్యాన్సర్‌ బాధితు ల నిర్ధారణ లెక్కల విషయంలో చాలా తప్పు లు ఉన్నాయని..వైద్య ఆరోగ్య శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

బలభద్రపురంలో క్యాన్సర్‌పై తప్పుడు నివేదిక
రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతున్న అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 5 (ఆం ధ్రజ్యోతి): బలభద్రపురంలో క్యాన్సర్‌ బాధితు ల నిర్ధారణ లెక్కల విషయంలో చాలా తప్పు లు ఉన్నాయని..వైద్య ఆరోగ్య శాఖ చాలా నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడారు. బలభద్రపురం పరిసర ప్రాంతాల్లో క్యాన్సర్‌ బాధితులు అధికంగా ఉన్నారని అసెంబ్లీలో తాను ప్రస్తావించగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.అక్కడ వైద్య శిబిరాలు పెట్టి 33 క్యాన్సర్‌ కేసులు గుర్తించారని చెప్పారు. స్థానిక పీహెచ్‌సీ సెంటర్‌ రికార్డుల్లో నమోదు చేసిన వాటిని ప్రమాణికంగా తీసుకుని డీఎంహెచ్‌వో నివేదిక ఇచ్చేశారన్నారు.10 వేల మందికి వైద్యపరీక్షలు చేయకుండా ఎలా నివేదికలో లెక్కలు తేల్చేస్తారని ప్రశ్నించారు. రంగరాయ మెడికల్‌ కళాశాల వారు గ్రామంలో 399 కుటుం బాల్లో 1295 మందికి వైద్య పరీక్షలు చేసి 62 మందికి క్యాన్సర్‌ నిర్ధారణ చేశారని చెప్పారు. ఇంకా గ్రామంలో 8700 మందికి వైద్యపరీక్షలు చేస్తే వారిలో ఎంతమంది ఉంటారో అనే ఆం దోళన నెలకొందన్నారు. ప్రజలు ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్‌ వ్యాధి పెరగడానికి మూలకారణం కనుగొనాలన్నారు. పొల్యూషన్‌ బోర్డు చైర్మన్‌ కు ఫిర్యాదు చేశామన్నారు.ప్రజల ఆరోగ్యం పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి,బుల్లిరెడ్డి,రామారావు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:45 AM