Share News

ప్రేమ పేరుతో మోసగించి.. వ్యభిచార వృత్తిలోకి దింపి..

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:32 AM

పెద్దాపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఓ మైనర్‌ బాలికకు ప్రేమ పేరుతో వల వేసి ఆపై పెళ్లి పేరుతో మోసగించి వ్యభిచార వృత్తిలోకి దింపి నరకం చూపించారు ఓ తల్లికొడుకు. దీంతో బాలిక ఆచేతన స్థితికి వెళ్లింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అసలేం జరిగిందంటే..

ప్రేమ పేరుతో మోసగించి.. వ్యభిచార వృత్తిలోకి దింపి..
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు

పెద్దాపురంలో బాలికకు నరకం చూపించిన తల్లీకొడుకు

అచేతన స్థితికి చేరుకున్న బాధితురాలు

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

పెద్దాపురం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఓ మైనర్‌ బాలికకు ప్రేమ పేరుతో వల వేసి ఆపై పెళ్లి పేరుతో మోసగించి వ్యభిచార వృత్తిలోకి దింపి నరకం చూపించారు ఓ తల్లికొడుకు. దీంతో బాలిక ఆచేతన స్థితికి వెళ్లింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే..

స్థానిక ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన చందు అనే యువకుడు అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ 17 ఏళ్ల మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో మోసగించి ఆపై పెళ్లి పేరుతో వంచించి పెద్దాపురం తీసుకు వచ్చాడు. కొన్నిరోజులు గడిచాక తల్లీ నీలిమ, కొడుకు చందూ డబ్బుపై ఆశతో బాలికకు తమ విశ్వరూపాన్ని చూపించారు. వ్యభిచారం చేయా లంటూ వేధించడం ప్రారంభించి నిత్యం బాలి కకు నరకం చూపించారు. బలవంతంగా బాలి కతో వ్యభిచారం చేయించారు. దీంతో బాలిక అ నారోగ్యం పాలయ్యింది. అలాగే కొన్ని రోజులకు ఆమె శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీతో చికిత్స చేయించారు. బాలికకు రకరకాల మందులను వాడించి నానాహింసలకు గురి చేశారు. తల్లీ కొడుకులు పెట్టే బాధలు తాళ లేక గతేడాది డిసెంబరు 28న చీమల మందు తాగి బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే బాలికకు చేతులు, కాళ్లు వంకర్లు పోయి కదలేక అచేత నంగా ఉండిపోయింది. కాకినాడ చేరుకున్న బాలిక తల్లి దండ్రులు విశాఖ విమ్స్‌కు తీసుకు వెళ్లి చికిత్స అందించారు. బాలిక మానసిక స్థితి కూడా తేడా రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితు లైన తల్లీకొడుకుపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన నిందితులు పరారీ కావడంతో పోలీసులు ముమ్మంగా గాలించి అరెస్ట్‌ చేశారు.

పోక్సో కేసు నమోదు

మైనర్‌ బాలికతో నిర్భంధ వ్యభిచారం చేయిం చిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వెల్లడించారు. బుధవారం డీఎస్పీ కార్యాలయం లో నిందితులను మీడియా ఎదుట హాజరుపరి చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడు తూ సుమారు 6 నెలల క్రితం బాధిత మైనర్‌ బాలికకు పెద్దాపురానికి చెందిన ధరణికోట చందు అనే యువకుడితో ప్రేమ వివాహం జరి గిందన్నారు. బాలికను ఆమె అత్తగారు వ్యభి చారం చేయమని ప్రోత్సహించినట్టు, డ్రగ్స్‌ ఇచ్చి ఇబ్బంది పెట్టినట్టు పోలీసులకు తెలియచేయ లేదన్నారు. ఈనెల 25న పెద్దాపురం పోలీస్‌ స్టేషన్‌కు వైజాగ్‌ విమ్స్‌ ఆసుపత్రి నుంచి వచ్చిన బాధిత బాలిక తల్లి వచ్చి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై ఈనెల 26న కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే నిందితుడు చందుపై పోక్సో కేసు నమో దు చేశామన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తామన్నా రు. ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు. సమావేశంలో సీ ఐ ఏ.కృష్ణ భగవాన్‌, ఎస్‌ఐ మౌనిక పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 12:32 AM