Share News

2027కే పోలవరం

ABN , Publish Date - Mar 28 , 2025 | 01:09 AM

పోలవరం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు ఆదేశించారు.

2027కే పోలవరం
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు

రాజమహేంద్రవరం, మార్చి 27 (ఆం ధ్రజ్యోతి) : పోలవరం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు ఆదేశించారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను గురువారం సందర్శించి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ప్రాజెక్టు నుంచి నీళ్లొదిలే లోపే పునరావాసం పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు కోసం త్యాగం చేసి నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం మీదన్నారు. పునరా వాస కార్యక్రమాలు పూర్తి చేయడానికి అవస రమైన సిబ్బందిని కూడా ఇస్తామని చెప్పారు. 2014 ముందు నిర్వాసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారని,2014లో తాము అధికా రంలోకి రాగానే 4,311 కోట్లు పరిహారం చెల్లించినట్టు చెప్పారు. మొత్తం రూ.829 కోట్లు నిర్వాసితుల అక్కౌంట్లలో జమ చేశామన్నారు. పరిహారం రూ.10 లక్షలు ఇస్తానని చెప్పిన జగన్‌ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, వరదల సమయంలో కూడా బాధితులను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020నాటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు.వైసీపీ నిర్లక్ష్యం వల్ల ఖర్చు బాగా పెరిగిపో యింద న్నారు.రూ.400 కోట్లతో తాము డయా ఫ్రం వాల్‌ నిర్మిస్తే, వైసీపి నిర్లక్ష్యం వల్ల కొట్టుకు పోయిందని చెప్పారు. ఇవాళ మళ్లీ రూ. 990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మిస్తున్నామన్నా రు. కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారని, విచారణ జరిపించి, అర్హులం దరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. పునరావాసంతో పాటు మీ ఆదాయమార్గాలు, జీవన ప్రమాణాలు పెరిగే చర్యలు తీసుకుం టామన్నారు.ఇళ్లు నిర్మించుకునే గిరిజనులకు రూ.75వేలు అదనంగా అందిస్తామన్నారు. అంతకు ముందు డ్రయాఫ్రంవాల్‌ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శ నకు వచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు ముందు ఘన స్వాగతం లభించింది. ప్రజా ప్రతినిధులు, అఽధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. సీఎం కూడా అందరినీ పలకరిస్తూ ముందుకు వెళ్లారు. పోలవరం నిర్వాసితులు, ఇతరులు సీఎంకు వినతి పత్రా లు ఇచ్చారు.అనేకమంది జై బాబు జైజై బాబు అంటూ నినాదాలు చేశారు. ఆయన వెంట మంత్రులు నిమ్మల రామానారాయుడు, కె.పా ర్థసారథి,ఎమ్మెల్యేలు పితాని సత్యనారా యణ,బత్తుల బలరామకృష్ణ,జ్యోతుల నెహ్రూ, రుడా చైర్మన్‌ బీవీఆర్‌ చౌదరి ఉన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 01:09 AM