Share News

కుందేలును మింగి..ప్రహరీ గోడ భాగంలో చిక్కి!

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:17 AM

గోకవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం బావాజీ పేట గ్రామ సమీపంలో పోలవరం కాలువ గట్టుపై ఉన్న పవర్‌ ప్లాంట్‌లో శనివా

కుందేలును మింగి..ప్రహరీ గోడ భాగంలో చిక్కి!
కుందేలును మింగి కదలేని స్థితిలో ఉన్న కొండచిలువ

పవర్‌ ప్లాంట్‌లో కొండచిలువ హల్‌చల్‌

గోకవరం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం బావాజీ పేట గ్రామ సమీపంలో పోలవరం కాలువ గట్టుపై ఉన్న పవర్‌ ప్లాంట్‌లో శనివారం కొండ చిలువ హల్‌చల్‌ చేసింది. విధుల్లో ఉన్న ప్లాంట్‌ సిబ్బందికి కొండ చిలువ కనబడడంతో ఆందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారి భాస్కర్‌ కృష్ణ, సిబ్బంది ప్లాంట్‌ వద్దకు చేరుకుని కొండచిలువను గమనించి స్నేక్‌ క్యాచర్‌ను రప్పి ంచారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన స్నేక్‌ క్యాచర్‌ గంట సేపు శ్రమించి కొండ చిలువను పట్టుకున్నారు. అయితే అప్పటికే కొండ చిలువ కుందేలును మింగి ఉండ డంతో కదలలేక ప్లాంట్‌ ప్రహరీ గోడ అడుగు భాగంలో చిక్కుకుంది. చివరికి కొండ చిలువను పట్టుకుని దేవీపట్నం మండలం దండంగి రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో వదిలేశారు.

Updated Date - Mar 23 , 2025 | 12:17 AM