Share News

ఆగిన అంతిమయాత్ర!

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:07 AM

ఎటపాక, మార్చి 28 (ఆంరఽధజ్యోతి): ఓ వృద్ధురాలు అనార్యోగంతో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊరేగింపుగా బాణసంచా కాలుస్తూ దహన సంస్కారాలు నిర్వ హించేందుకు అంతిమయాత్రగా వెళ్తు న్నారు. అ యితే బాణసంచా కాల్పల అలికిడికి తేనే తుట్ట కదిలి అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై ఒక్క సారిగా దాడిచేశాయి. దీంతో వారు మృతదేహా న్ని అక్కడే వదిలి పెట్టి ప్రాణభయంతో పరుగులు తీశారు. దాంతో అంతిమ యాత్ర ఆగిపోయిన ఘటన శుక్రవారం అల్లూరి జిల్లా ఎట పాక మండలం గన్నేరుకొయ్యపాడు గ్రామంలో జరి గింది. గన్నేరుకొయ్యపాడు గ్రామానికి చెందిన కొప్పుల పల్లమ్మ (82) గురువారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం అంతిమయా

ఆగిన అంతిమయాత్ర!
రహదారిపై ఉండి పోయిన వృద్ధురాలి మృతదేహం

బాణసంచా పేల్చడంతో

హఠాత్తుగా తేనెటీగల దాడి

మృతదేహాన్ని వదిలి పరుగులు

పెట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు

26 మందికి గాయాలు,

ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం

రహదారిపైనే రెండుగంటల

పాటు మృతదేహం

ఎటపాక, మార్చి 28 (ఆంరఽధజ్యోతి): ఓ వృద్ధురాలు అనార్యోగంతో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఊరేగింపుగా బాణసంచా కాలుస్తూ దహన సంస్కారాలు నిర్వ హించేందుకు అంతిమయాత్రగా వెళ్తు న్నారు. అ యితే బాణసంచా కాల్పల అలికిడికి తేనే తుట్ట కదిలి అంతిమయాత్రలో పాల్గొన్న వారిపై ఒక్క సారిగా దాడిచేశాయి. దీంతో వారు మృతదేహా న్ని అక్కడే వదిలి పెట్టి ప్రాణభయంతో పరుగులు తీశారు. దాంతో అంతిమ యాత్ర ఆగిపోయిన ఘటన శుక్రవారం అల్లూరి జిల్లా ఎట పాక మండలం గన్నేరుకొయ్యపాడు గ్రామంలో జరి గింది. గన్నేరుకొయ్యపాడు గ్రామానికి చెందిన కొప్పుల పల్లమ్మ (82) గురువారం అర్ధరాత్రి అనారోగ్యంతో మృతిచెందింది. కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం అంతిమయాత్ర ని ర్వహించారు. అయితే ఇందులో భాగంగా రెండు సార్లు (దింపుడుకళ్లం) మృతదేహాన్ని కిందకు దించుతారు. గన్నేరుకొయ్యపాడు గ్రామంలో 3 రహదారుల జంక్షన్‌ వద్ద మృతదేహాన్ని పాడి మీద నుంచి కిందికి దింపి బాణసంచా కాల్చల ంతో చెట్టుపై తేనేపట్టుతో ఉన్న తేనెటీగలు అం తిమయాత్రలో పాల్గొన్నవారిపై దాడి చేశాయి. దాంతో అక్కడ ఉన్న సుమారు 70 మంది తలో దిక్కుకు పరు గులు తీశారు. 100పైగా తేనేటీగ లు మూకుమ్మడిగా దాడి చేశాయి. ముగడ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి స్పృహా కోల్పోయాడు. కొందరు నీటి డమ్ముల్లో దాక్కున్నారు. మరికొందరు ఇళ్లలోకి పరుగులు పెట్టారు. 26 మంది గాయపడ్డారు. వెంటనే సమీపంలోని గౌరిదేవి పేట పీహెచ్‌సీకి వెళ్లడంతో ఇద్దరు వైద్యులు, సిబ్బంది గాయపడ్డ వారి శరీరంపై తేనే టీగల ముళ్లను తొలగిం చారు. దాంతో వారికి ప్రాణా పాయం తప్పింది. ముగడా చంద్రశేఖర్‌, కొప్పుల వెంకటేశ్వరావు, ముత్యాల నరేష్‌ పరిస్థితి ఆందోళ నకరంగా ఉండడంతో అంబులెన్స్‌లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి పాల వడంతో పల్లమ్మ అంతిమయాత్ర ఆగిపోయి మండుటెండలో మృ తదేహం రహదారిపై 2 గంటల పాటు ఉండి పోయింది. తేనెటీగలు ఇంకా చుట్టుముట్టి ఉన్నాయన్న భయంతో మృతదేహం వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. తర్వాత మృతదేహాన్ని ట్రాక్టర్‌లో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Updated Date - Mar 29 , 2025 | 12:07 AM