లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ, డ్రైవర్‌కు 14రోజుల రిమాండ్
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:27 AM
పిఠాపురం రూరల్, మార్చి 25 (ఆంధ్ర జ్యోతి): లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్‌ఐ ఎల్.గుణశేఖర్, ప్రవేటు డ్రైవర్ నల్లా శివలకు 14రోజులు పాటు రిమాండ్ విధిస్తూ రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి

పిఠాపురం రూరల్, మార్చి 25 (ఆంధ్ర జ్యోతి): లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ ఎస్‌ఐ ఎల్.గుణశేఖర్, ప్రవేటు డ్రైవర్ నల్లా శివలకు 14రోజులు పాటు రిమాండ్ విధిస్తూ రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజులను 2024 అక్టోబరులో న మోదైన ఎస్సీ, ఎస్టీ కేసు నుంచి తప్పించేందుకు ఎస్‌ఐ రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం తీసుకుంటుండగా రూరల్ ఎస్‌ఐ గుణశేఖర్‌తో పాటు అతను వినియోగించే పోలీసు జీపు ప్రవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్న నల్లా శివను ఏసీబీ డీఎస్పీ కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దాడి చేసి పట్టుకున్న సంగతి తెలిసిందే. వారిని రాజమహేంద్రవరం ఏసీబీ కార్యాలయంలో మంగళవారం వి చారించారు. రాత్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 18వ తేదీ వరకూ జడ్జి రిమాండ్ విధించారు. అరెస్టు అనంతరం ఎస్‌ఐ వద్ద ఉన్న మొబైల్స్‌తో పాటు ప్రవేటు డ్రైవర్ వద్ద ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌లో కేసులకు సంబంధించిన కొన్ని రికార్డులు తమతో తీసుకెళ్లినట్టు సమాచారం.
లావాదేవీలపై ఆరా...
పిఠాపురం రూరల్ ఎస్‌ఐ, ప్రవేటు డ్రైవర్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు అందులో ఫోన్‌కా ల్స్, వాట్సాప్ మెసేజీలు, ఫోన్‌పే, జీ పే లావాదేవీలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎస్ ఐ నుంచి ఫోన్‌పే ద్వారా ఒక పోలీసు ఉన్నతాధికారి వద్ద పనిచేస్తూ ఎస్సీ,ఎస్టీ కేసులు చూసే సిబ్బంది ఒకరికి పంపిన నగదు విషయాన్ని గుర్తించి దానిపై ఆరా తీస్తున్నట్టు పోలీసు వర్గా లు తెలిపాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఎస్‌ఐ ఏసీబీకి చిక్కడంతో కాకినాడ సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులందరూ అలర్టయ్యారు. ప్రవేటు వ్యక్తులను పోలీసుస్టేషన్లకు రావద్దని చెప్పడం గమనార్హం.