సత్యసాయి కార్మికులతో నేడు పవన్ భేటీ
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:49 AM
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ అసెంబ్లీలో సత్యసాయి వాటర్ స్కీమ్ కార్మికుల సమస్యలపై సోమవారం గళ మెత్తారు.

డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు!
రాజమహేంద్రవరం, మార్చి 18 (ఆంధ్ర జ్యోతి) : రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ అసెంబ్లీలో సత్యసాయి వాటర్ స్కీమ్ కార్మికుల సమస్యలపై సోమవారం గళ మెత్తారు. మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి విన్నవించారు. దీనిపై ఆ వెంటనే డిప్యూ టీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సమ స్య పరిష్కారం కోసం చర్చిద్దామని బుధవా రం సాయంత్రం అమరావతికి రావాలని యూనియన్ నేతలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారు లకు ఆహ్వానం పంపారు. ఇదిలా ఉండగా 48 నెలలుగా జీతాలి వ్వకపోవడంతో చేపట్టిన దీక్ష ను కలెక్టర్ కార్మికులతో చర్చించి మంగళవారం విరమింపజేశారు.సీతానగరం మండలం పురు షోత్తపట్నం వద్ద గోదావరి నుంచి నీటిని పం ప్ చేసి వివిధ గ్రామాల మంచినీటి అవస రాలు తీర్చడం కోసం సత్యసాయి ట్రస్ట్ పం పింగ్ స్కీమ్ నిర్మించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఇది కొనసాగుతోంది. సీతానగ రం,గోకవరం, కోరుకొండ, రాజానగరం మండ లాల్లోని 74 హేబిటేషన్లకు ఈ పథకం ద్వారా మంచినీరు సరఫరా అయ్యేది. దీని కోసం 60 మంది వరకూ పనిచేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కలెక్టర్ పర్యవేక్షించేవారు. వైసీపీ ప్రభుత్వంలో దీనిని అసలు పట్టించుకోలేదు. ఇప్పటి వరకూ మొ త్తం 48 నెలల జీతాలు పెండింగ్ ఉండడం గమనార్హం. గత ప్రభుత్వం జీతాలకే కాదు.. నిర్వహణకు సొమ్ములివ్వలేదు.దీంతో తాము జీతాల్లే కుండా పనిచేయలేమని చెబుతూ సోమవారం లాలాచెరువులోని ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం ఎదుట కార్మికులు దీక్ష ఆరంభిం చారు.కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జోక్యం చేసుకుని వారితో చర్చిం చడంతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తో డిప్యూటీ సీఎం చర్చలకు ఆహ్వానించారు. ఈ సమా వేశానికి కార్మిక నాయకులతో పాటు ఆర్‌డబ్ల్యు ఎస్ ఎస్‌ఈ గిరి వెళ్లనున్నారు.
కార్మికుల నెల జీతాలకు రూ.10 లక్షలు : కలెక్టర్
సత్యసాయివాటర్ స్కీమ్ కార్మికుల నెల జీతం కోసం రూ.10 లక్షలు ఇవ్వడానికి తా ము చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.కలెక్టర్ క్యాంపు కార్యా లయంలో ఆమె మంగళ వారం కార్మికులతో చర్చించారు. వేసవి దృష్ట్యా మంచినీటి సర ఫరాకు ఎటువంటి ఆటంకం రాకూడ దన్నా రు.స్థానిక సంస్థల్లో స్కీమ్‌ను విలీనం చేయ డం వల్ల నిధులు సాధ్యమవుతాయన్నారు. సత్య సాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూ నియన్ నేతలు కట్టమూరి వీరబాబు, ఉం దుర్తి ఇస్సాక్ మాట్లాడుతూ తమకు వచ్చిన హామీ మేరకు దీక్ష విరమిస్తున్నామన్నారు.