తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:28 AM
జగ్గంపేట రూరల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సు జగ్గంపేట మండలం కె. కొత్తూరు గ్రామ శివారున అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. స్కూలు ముగిసిన తరువా త పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో ఈ

అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయిన స్కూల్ బస్సు
40 మంది పిల్లలు సురక్షితం
జగ్గంపేట రూరల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సు జగ్గంపేట మండలం కె. కొత్తూరు గ్రామ శివారున అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. స్కూలు ముగిసిన తరువా త పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగిం ది. ఆ సమయంలో బస్సు లో 40 మంది పిల్లలు ఉన్నారు. పక్కనే ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొని పొలాల్లోకి వెళ్లి ఆగింది. విద్యుత్ వైర్లు పక్కకు ఒ రిగి అలా ఉండిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిల్లలను బస్సులోంచి దిం చి వెంటనే వేరే బస్సులో వారి గమ్య స్థానాలకు చేర్చారు. గడ్డి బండి అకస్మాత్తుగా రావడంతో బస్సు అదుపు తప్పినట్టు డ్రైవర్ తెలిపాడు.