దేవదాయ మంత్రికి వెంకన్న కల్యాణోత్సవాల ఆహ్వానం
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:37 AM
ఆత్రేయపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణమహోత్సవం ఏప్రిల్ 7 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. 8న రథోత్సవం, తీర్థం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపఽథ్యంలో రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామ

ఆత్రేయపురం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణమహోత్సవం ఏప్రిల్ 7 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. 8న రథోత్సవం, తీర్థం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపఽథ్యంలో రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కల్యాణోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ ఉకమిషనరు నల్లం సూర్యచక్రధరరావు స్వయగా అమరావతి క్యాంపు కార్యాలయానికి వెళ్లి అందజేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను కూడా అందజేశారు.
వెంకన్న ఆలయంలో ఆర్జేసీ పూజలు
వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి ద్వారక తిరుమల ఆర్జేసీ ఎన్వీ.సత్యనారాయణమూర్తి స్వామివారిని దర్శి ంచుకున్నారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శానంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన దేవస్థానం అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఉపకమిషనరు నల్లం సూర్యచక్రధరరావు స్వామి చిత్రపటం అందచేశారు.