వాడపల్లి ఒక్కరోజు ఆదాయం రూ.2.30లక్షలు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:40 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది.

ఆత్రేయపురం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంత రం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.2,30,300 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వకుళ మాత అన్నదాన భవన నిర్మాణానికి అమలాపురానికి చెందిన స్వామినాయుడు శిరిష, దంపతులు రూ.1,11,600 విరాళం ఇవ్వగా, దాతలకు స్వామివారి చిత్రపటం అందచేశారు. ఆలయంలోని మాడ వీధుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఉపకమిషనరు పరిశీలించారు. ప్లై ఓవర్‌పై గ్రీన్‌మ్యాట్ పనులను ఇంజనీరింగ్ బృందంతో పర్యవేక్షించారు.