Share News

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:33 AM

Loan Repayment Tips: అప్పులు చేసేముందు కొన్ని కీలక విషయాలు పాటించకపోతే ఇబ్బందులకు గురికాక తప్పదు. ఎలాంటి అప్పులు తీసుకోవాలి.. వడ్డీ ఎంతుండాలి.. అప్పు చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం
Loan Repayment Tips

చాలా మంది ఆర్థిక అవసరాల కోసం అప్పులు చేస్తుంటారు. కానీ వాటిని తీర్చేటప్పుడు మాత్రం ఇబ్బందులకు గురవుతుంటారు. కొంతమందికి అప్పులు తీసుకునే సమయంలో వాటిపై సరైన అవగాహన లేక.. అప్పు తీసుకున్నాక అనేక సమస్యలు ఎదుర్కుంటుంటారు. వడ్డీలు, అప్పు వ్యవధి కాలం, ఎలాంటి అప్పులు చేయాలని అనే వాటిపై చాలా మందికి అవగాహన ఉండి ఉండదు. అయితే అప్పులు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం టెన్షన్‌ పడటం ఖాయం. అప్పులు తీసుకునేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుల విషయంలో ఎలా ముందడుగు వేయాలి.. అప్పులు తీసుకునేటప్పుడు తెలుసుకోవాల్సి కీలక విషయాలేంటి ఇప్పుడు చూద్దాం.


వడ్డీ రేటు: అప్పు తీసుకునేటప్పుడు వడ్డీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. బ్యాంకుల్లో పర్సనల్ లోన్ వడ్డీ పది నుంచి పదిహేను శాతం (10-15 శాతం) వరకు ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డులు 24 నుంచి 36 శాతం వరకు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం దాచిన ఛార్జీలు లేకుండా చూసుకోవడం బెటర్.

చెల్లింపు కాలం: అప్పులు తీసుకున్నా.. దాన్ని ఎంత వ్యవధిలో తీరుస్తారో తెలుసుకోవాలి. ఎక్కువ వ్యవధి ఉంటే తక్కువ ఈఎంఐ ఉంటుంది కానీ.. వడ్డీ ఎక్కువ. మనకు వచ్చే ఆదాయంలో 40 శాతం మించకుండా ఈఎంఐ (EMI) ఉండేలా చూసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చెబుతోంది.

దాచిన ఖర్చులు: లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ పెనాల్టీ వంటివి ఉన్నాయా లేవా అనేవి తెలుసుకోవాలి. ఎకనమిక్ టైమ్స్ ప్రకారం ఈ ఖర్చులు మొత్తం అప్పును 2 నుంచి 5 శాతానికి పెంచుతాయి.


ఆదాయ సామర్థ్యం: మనకు వచ్చే ఆదాయంలో అప్పును తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా లేదా అనేది ముందుగానే ఆలోచన చేసుకోవాలి. సామర్థ్యానికి మించి అప్పు.. ఆర్థిక సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని నేషనల్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ హెచ్చిరిస్తుంది.

అప్పు రకం: మనకు ఉండే అవసరాన్ని బట్టే అప్పును ఎంచుకోవాలి. హౌస్ లోన్, పర్సనల్ లోన్, క్రిడెట్ కార్డ్.. వీటిలో ఏది అవసరమో దాన్నే ఎంపిక చేసుకోవాలి. హౌస్ లోన్ వడ్డీ (8-9శాతం) తక్కువగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా చెబుతోంది.

ముఖ్య సలహా: ముఖ్యంగా అప్పును తీసుకునేందుకు... వారు ఇచ్చే ఒప్పందాన్ని పూర్తిగా చదువుకోవాలి. అలాగే ఆర్థిక సలహాకారుడిని సంప్రదించాలి. ఇలా చేయడం ద్వారా ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలను నివారించుకునే వీలు ఉంటుంది.


ఇవి కూడా చదవండి...

Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!

Read Latest Business News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 11:47 AM