Governor Abdul Nazeer : గాంధీజీ జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:45 AM
మహాత్మాగాంధీ 77వ వర్ధంతిని అమర వీరుల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు యావత్ మానవాళికి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. మహాత్మాగాంధీ 77వ వర్ధంతిని అమర వీరుల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో గురువారం రాజ్‌భవన్‌లో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. గాంధీజీ చిత్రపటానికి గవర్నర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అహింస, సత్యాగ్రహం, శాసనోల్లంఘనతత్వాల ద్వారా స్వా తంత్య్ర ఉద్యమాన్ని నడిపించడంలో గాంధీజీ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. గవర్నర్ కార్యదర్శి హరిజవహర్‌లాల్, జాయింట్ సెక్రటరీ సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.