తెలుగుగంగ కాలువకు నీరెప్పుడో..?
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:31 PM
తెలుగు గం గ కాలువకు నీరురాదు.. ఆయకట్టు రైతులకు బెం గతీరదు అన్నట్లు అట్లూరు మండలం నిలి చింది.

నీరు రాక వెలవెలబోతున్న అట్లూరు మండలంలోని చెరువులు ఆందోళనలో రైతులు ప్రభుత్వం చొరవచూపాలంటున్న వైనం
అట్లూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తెలుగు గం గ కాలువకు నీరురాదు.. ఆయకట్టు రైతులకు బెం గతీరదు అన్నట్లు అట్లూరు మండలం నిలి చింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారవని రైతన్నలు వాపోతున్నారు. అట్లూ రు మండలంలో మూడేళ్లుగా తెలుగుగంగ కాల్వ పనులు ముందుకు సాగకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బ్రహ్మం సాగర్‌లో పుష్కలంగానీరున్నా చెరువులకు నీరు చేరలేదు. అట్లూరు మండలానికి చేరువగా ఉన్న ఎర్రబల్లె చెరువు, లింగాలకుంట చెరువు, కుంభ గిరి యాదవుల చెరువు, సిద్దిరాజుచెరువు, కొండూ రు మర్రిమానుకుంట, నల్లకుంట చెరువు, ఎర్రచె రువు, రెడ్డిపల్లెకు చెందిన రెడ్డిచెరువు, అట్లూరు వద్ద కొత్తచెరువులకు తెలుగుగంగ నీరు చేరలేదు. ఈ చెరువులన్నీ తెలుగుంగ కుడికాల్వ కు పక్కనే ఉన్నాయి. ఈ చెరువుల కింద దాదాపు 3వేల ఎక రాలు అసైన భూములు పట్టా భూ ములున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ, ఓసీ బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వర్షాధా ర పంటలు వేసి సాగు చేసే రైతులే ఎక్కువగా మంది ఉన్నారు. బద్వేలు మండలానికి చెందిన వెంకటశెట్టిపల్లె చెరువు, రాజుపాలెం చెరువులకు నీరు నింపారు కాని అట్లూరు మండలానికి మా త్రం మొండి చేయి చూపారు. 2002లో రూ11 కోట్లతో వైసీపీ ప్రభుత్వంలో గుత్తేదారుడు తెలు గుగంగ కాల్వ పనులు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు పనులు పూర్తి చేయక అసంపూర్తిగా ఉండ డంతో బ్రహ్మం సాగర్‌లో నీరు ఉన్నా తెలుగుగంగ కాల్వకు సాగే పరిస్థితి లేదు.
గుత్తేదారుడిని రైతు లు ఎన్నో మార్లు ప్రశ్నించగా బిల్లులు సక్రమంగా రావడం లేదని చెప్పడంతో రైతులకు నిరాశ ఏర్ప డింది. ఖరీఫ్, రబీ సీజన్లు ముగుస్తున్నా చెరువులకు చ్కునీరు చేరకపోవ డంతో బోరుబావుల్లో కూడా నీరు అడుగంటు తుండడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు అధికారులు స్పందించి త ్వరితంగా కాల్వ పనులు పూర్తి చేసి చెరువులకు నీరందించాలని అట్లూరు మండల రైతులు కోరు తున్నారు.
చెరువులకు నీరందించి ఆదుకోవాలి
తెలుగుగంగ కాలువ పనులు సత్వరం పూర్తిచేసి చెరువులకు నీరందించాలి. బ్రహ్మంసాగర్‌లో నీరు ఉన్నా చెరువులకు నింపక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా చెరు వులకు నీరు నింపకపోతే బోరు బావుల్లో కూడా నీటిమట్టం తగ్గిపోయి సాగు చేసి న చీనీ చెట్లు మామిడి ఎండిపోయే దశకు వచ్చా యి. ప్రభుత్వం రైతులను ఆదకోవాలి.
- బత్తల వెంకటసుబ్బయ్య,
మరిమానుకుంట చెరువు ఉపాధ్యక్షుడు