AP News; ఏపీలో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్
ABN , Publish Date - Feb 14 , 2025 | 08:00 AM
ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో (Sub-Registrar Offices) డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అప్పాయింట్‌మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ (Dynamic Que Management System)ను ప్రభుత్వం (AP Govt.) ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజలు వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్ లైన్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డిజిటల్‌గా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకునే అవకాశం ఉంది. తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రెషన్‌లు, లేదా వివాహ రిజిస్ట్రేషన్ లాంటి వివిధ సేవలను ఎంపిక చేసుకునే వీలు ఉంటుంది.
ఈ వార్త కూడా చదవండి...
వంశీకి 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్‌కు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందించనున్నట్టు తెలిపింది. డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు అయిన స్లాట్‌ను రద్దు చేసుకుంటే రూ.100, సమయం మార్పు చేస్తే రూ.200 చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్‌లైన్ ద్వారా డాక్యుమెంట్‌లను అప్లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు సంబధించిన ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన ఈ సిస్టమ్ ద్వారా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి ఆమోదం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఐజీని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి మెహర్బానీ ఖరీదు రూ.343 కోట్లు!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News