Share News

Sadhineni Yamini: వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:54 AM

Sadhineni Yamini: మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారని బీజేపీ నేత సాధినేని యామిని అన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారన్నారు. మహిళలకు 4 లక్షల‌ కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయించారని.. ఏపీకి సంబంధించి పోలవరం, రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు.

Sadhineni Yamini: వైసీపీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత
BJP Leader Sadhineni Yamini

విజయవాడ, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) అన్ని వర్గాల వారికి మేలు‌చేసేలా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని (BJP Leader Sadhineni Yamini) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు వికసిత భారత్ ఫలాలు అందేలా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో ‌కేంద్ర పధకాలకు స్టిక్కర్లు వేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లల్లో అద్భుతమైన పాలన అన్న వారు.. ఇప్పుడు తప్పు పడుతున్నారని తెలిపారు.


మహిళలు, రైతులు, శ్రామికులకు ఆసరా ఇచ్చే బడ్జెట్ ఇది అని.. లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఆలోచన చేశారన్నారు. 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను లేకుండా చేశారన్నారు. మహిళలకు 4 లక్షల‌ కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్‌లో కేటాయించారని.. ఏపీకి సంబంధించి పోలవరం, రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించారని అన్నారు. పోలవరం మొదటి దశ పనులకు దాదాపు 35 వేల‌ కోట్లు ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు‌ చేసేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు బడ్జెట్ గురించి నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లల్లో వైసీపీ‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని.. అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఇంట్లో కూర్చో పెట్టారని విమర్శలు గుప్పించారు. అమరావతి భ్రమరావతి అని కుట్రలు చేసి రాజధానిని నాశనం చేశారన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా ప్రజలు కూటమి పక్షాన ఉన్నారన్నారు.

Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు


అర్ధరాత్రి తలుపులు మూసి విభజన చేసిన కాంగ్రెస్‌కు తమను విమర్శించే అర్హత లేదని అన్నారు. పిల్ల కాంగ్రెస్ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తోందని వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆధ్వర్యంలో అనేక రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణం ఏపీలో జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలు ఏపీకి రావాలంటే భయపడ్డారని.. ఉన్న పరిశ్రమలు కూడా మూయించి పంపించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక మంది పారిశ్రామిక వేత్తలు ఏపీ‌ వైపు చూస్తున్నారన్నారు. కేంద్రం కూడా వారికి అనేక రూపాలలో సాయం అందిస్తోందని తెలిపారు. ప్రధాన ఎయిర్ పోర్ట్‌లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అనేక కేంద్ర ప్రాజెక్టులకు స్థలాలు కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చిన నిధులు కూడా ఇతర అవసరాలకు మళ్లించుకున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాయన్నారు.


‘‘మేము ప్రజల కోసం, రాష్ట్రం కోసం పని చేస్తుంటే... తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు మా పై బురద జల్లుతున్నాయి. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే...‌ వైసీపీకి ఈసారి ‌ఆ 11 సీట్లు కూడా రావు. ఆత్మ, పరమాత్మ అనుకున్న వాళ్లు కూడా వైసీపీని‌ వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్లారు..‌ ఇంకా అనేక మంది కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో వైసీపీ పూర్తిగా కనుమరుగవడం ఖాయం’’ అని సాధినేని యామిని వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

బంగారం ధరలు షాక్ కొట్టిస్తున్నాయి..

CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 11:59 AM